అభ్యర్థులను ప్రకటించడంపై చంద్రబాబు పై పవన్ కళ్యాణ్ ఫైర్

అభ్యర్థులను ప్రకటించడంపై చంద్రబాబు పై పవన్ కళ్యాణ్ ఫైర్

తొలిసారిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ, జనసేన పొత్తు, సీట్ల వ్యవహారం గురించి అలాగే టీడీపీ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడం వంటి విషయాలపై మీడియా ఎదుట స్పందించారు. ఎన్ని స్థానాలు తీసుకోవాలో తమకు తెలుసని.. 50 తీసుకోండి.. 60 తీసుకోండంటూ తనకు చెప్పాల్సిన పని లేదన్నారు. ఏమీ తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చాననుకుంటున్నారా? అంటూ పవన్ ఫైర్ అయ్యారు. ఒంటరి పోరుకు ఎందుకు వెళ్లడం లేదన్న విషయంపై కూడా తనకు క్లారిటీ ఉందన్నారు.

2019 ఎన్నికల్లో 150 స్థానాల్లో పోటీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా పవన్ గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లో 18 లక్షల ఓట్లు సంపాదించామన్నారు. అయితే సింగిల్‌గా వెళితే ఓట్లు వస్తాయి కానీ ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు చేయలేమన్న విషయాన్ని గ్రహించే పొత్తుకు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. సీఎం జగన్ టీడీపీతో పాటు జనసేనను కూడా వదలడం లేదన్నారు. అసలు సొంత చెల్లినే వదలని వాడు.. మనల్ని వదులుతాడా? అని ప్రశ్నించారు. జగన్‌కు ఊరంతా శత్రువులేనని పవన్ పేర్కొన్నారు.

అభ్యర్థులను ప్రకటించడంపై చంద్రబాబు పై పవన్ కళ్యాణ్ ఫైర్

టీడీపీ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడం… పొత్తు ధర్మం ప్రకారం సరికాదని.. కానీ చేశారన్నారు. అలా చేయడం తమ పార్టీలోని కొందరు నేతలను ఆందోళనకు గురి చేసిందన్నారు. అందుకు పార్టీ నేతలకు క్షమాపణలు చెప్పారు. లోకేష్ సీఎం పదవి గురించి మాట్లాడినా తాను పట్టించుకోలేదని.. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మౌనంగా ఉంటున్నానన్నారు. కొన్ని అనుకోకుండా జరుగుతుంటాయని.. వాటిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. పొత్తును ఇబ్బందులకు గురి చేసేలా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాకూడదని పవన్ పేర్కొన్నారు.