10 ఏళ్ల అవమానం.. అదిరిపోయే బదులిచ్చిన జనసేనాని!

10 ఏళ్ల అవమానం.. అదిరిపోయే బదులిచ్చిన జనసేనాని!

ఇదీ ‘పవర్’ స్టార్ పోరాటం అంటే..?

పదేళ్ల యుద్ధం.. పదేళ్ల అంతర్మథనం.. పదేళ్ల అవమానాలు.. అన్నీ ఇన్నాళ్లకు ఫలించాయి. జనసేనకు జనం పట్టం కట్టారు. 21 స్థానాల్లో పోటీ చేస్తే… అన్ని స్థానాలను ఆ పార్టీ ఖాతాలో వేసేందుకు సిద్ధమయ్యారు. తుది ఫలితం నాటికి కాస్త అటు ఇటు అవ్వొచ్చేమో కానీ అదిరిపోయే విజయం మాత్రం పక్కా. జగన్‌ను పాతాళానికి తొక్కేస్తా అని పవన్ అన్నారు.. అన్నట్టుగానే తొక్కేశారు. దత్తపుత్రుడనే మాటల దాడికి ఇవాళ గట్టి సమాధానమే చెప్పారు. పెళ్లిళ్ల పేరిట వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డా కూడా పవన్ ఎక్కడా మానసికంగా కుంగిపోలేదు. ఉక్కు సంకల్పంతో అడుగులు వేశారు. ఇవాళ పవన్‌ను ఢీకొట్టడం ఎంత కష్టమో వైసీపీకి తెలిసి ఉంటుంది.

10 ఏళ్ల అవమానం.. అదిరిపోయే బదులిచ్చిన జనసేనాని!

ఎన్నో ఒడిదుడుకులు..

రాజకీయ క్షేత్రంలో ఒక్కడిగా అడుగుపెట్టిన పవన్‌.. ఇప్పుడు చరిత్ర లిఖించడానికి సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ గేటు కూడా తాకలేరంటూ చేసిన అవమానాలకు సమాధానం చెప్పబోతున్నారు. ఆయన ఓకే అనాలే కానీ ఎందరో దర్శక నిర్మాతలు ఆయన ఇంటి ముందు క్యూ కడతారు. ఎన్ని యాడ్స్ కంపెనీలు సూట్‌కేసులతో సిద్ధమవుతారో ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాంటి వ్యక్తి తనను అంతెత్తున నిలబెట్టిన అభిమానుల కోసం ఏదైనా చేసేందుకు ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. వచ్చీ రాగానే టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. ఎన్డీయేతో మైత్రీని కొనసాగించారు.

10 ఏళ్ల అవమానం.. అదిరిపోయే బదులిచ్చిన జనసేనాని!

ఆ ఒక్కరూ పార్టీని వీడినా..

ఆ తరువాత టీడీపీతో మైత్రిని కొనసాగించక పోవడంతో కొంత ఇబ్బంది పడ్డారు. ఒక్కటంటే ఒక్క సీటు గెలవలేదు. తాను పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలైనా వెనుకడుగు వేయలేదు. ఎక్కడా తగ్గలేదు. గెలిచిన ఆ ఒక్క అభ్యర్థి పార్టీని వీడినా పట్టించుకోలేదు. ఇలాంటి సమయంలో ఎవరికైనా నిరాశ నిర్లిప్తతలు ఆవరిస్తాయి. కానీ పవన్‌ తనలో అలాంటివాటికి చోటివ్వలేదు. వైసీపీని ధైర్యంగా ఎదుర్కొన్నారు. పార్టీ ఫండ్ కోసం సినిమాలు చేశారు. ఎక్కడా ఓవర్ కాన్ఫిడెన్స్‌కు చోటివ్వలేదు. కాన్ఫిడెన్స్‌తో ముందుకెళ్లారు. పార్టీ ఫండ్‌తోనే కష్టంలో ఉన్నవారిని ఆదుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టైన సమయంలో తానున్నానంటూ ఆ పార్టీకి అండగా నిలిచారు. టీడీపీతో పొత్తు పెట్టుకుని మిత్ర ధర్మాన్ని పాటించారు. మొత్తానికి తాను తీసుకున్న 21 సీట్లలోనూ అభ్యర్థులను గెలుపు దిశగా పయనింపజేస్తూ అద్వితీయ విజయాన్ని పవన్ సాధించారు.

Google News