టీడీపీ-జనసేన కూటమి సునామి…

టీడీపీ-జనసేన కూటమి సునామి…

టీడీపీ-జనసేన కూటమి సునామిలో వైసీపీ కొట్టుకుపోయింది. అధికార వైస్సార్సీపీ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. గత ఎన్నికల్లో 23 సీట్లను టీడీపీ సాధిస్తే.. వైసీపీ చేసిన హేళన అంతా ఇంతా కాదు. దారుణంగా అవమానించింది. సరిగ్గా ఐదేళ్లు తిరిగే సరికి అందులో సగం కూడా ప్రజలు వైసీపీకి ఇవ్వలేదు. 11 సీట్లు కట్టబెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను పలుమార్లు బాడీ షేమింగ్ చేసింది. ఇసుక అక్రమ రవాణా.. ప్రాజెక్టులు రాష్ట్రానికి రాకుండా చేయడం.. ఉద్యోగ కల్పన లేకపోవడం.. ఉద్యోగుల పట్ల వ్యవహరించిన తీరు వంటివన్నీ ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. సంక్షేమం విజయం అంచుకు చేరుస్తుందనుకుంటే ప్రతిపక్ష హోదా కూడా కట్టబెట్టలేదు.

టీడీపీ-జనసేన కూటమి సునామి…

ఎన్డీఏ కూటమికి అయితే ఇది ఊహించని విజయం. కనీసం ఆ పార్టీ అయినా ఇంతటి గొప్ప విజయాన్ని ఊహించి ఉండదు. దాపు 163 సీట్లా? కలలో కూడా ఊహించని విజయమిది.. క్లిస్టర్ క్లియర్ ల్యాండ్ స్లైడ్ విక్టరీని ప్రజలు ఎన్డీఏ కూటమికి కట్టబెట్టారు. బీజేపీ,జనసేనతో కలిసి టీడీపీ ఎన్నికల బరిలోకి దిగింది. టీడీపీకి 135 స్థానాల్లో విజయం కట్టబెట్టనుండగా.. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించనుంది. ఇక వైసీపీ మొత్తంగా 11 స్థానాల్లో విజయం సాధించనుంది. తుది ఫలితం వెలువడే సమయానికి ఈ నంబర్ కాస్త అటు ఇటు అవ్వొచ్చేమో అంతకు మించి భారీ మార్పులు అయితే ఉండకపోవచ్చు.

టీడీపీ-జనసేన కూటమి సునామి…

స్వయంకృతమేనా?

93 శాతం స్ట్రైక్ రేట్‌తో కూటమి దూసుకెళుతోంది. నిజానికి ఇది కూటమి నేతలెవరూ ఊహించని విజయం. ఏదో గాలివానకు అన్నీ తుడిచిపెట్టుకు పోయినట్టుగా వైసీపీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ప్రతిపక్ష హోదా కూడా దక్కడం కష్టంగా మారింది. సంక్షేమం అంటూ పలవరించిన వైసీపీకి ఇది నిజంగా చెంపపెట్టే. ఉద్యోగులు, నిరుద్యోగులను పట్టించుకోలేదు. సిట్టింగ్‌లను ఇష్టానుసారంగా మార్చేశారు. ఇలా మార్చిన చోట ఎక్కడా కూడా వైసీపీ విజయం సాధించలేదు. వైసీపీ ఇంత దారుణ పరాజయంలో ఆ పార్టీ స్వయంకృతం కూడా ఉంది.

Google News