చంద్రబాబు చేసిన పనికి జగన్‌కి జై కొడుతున్న పెన్షన్‌దారులు..

చంద్రబాబు చేసిన పనికి జగన్‌కి జై కొడుతున్న పెన్షన్‌దారులు..

ఒకటో తేదీ వచ్చిందంటే చాలు.. ఉదయాన్నే వలంటీర్ వచ్చి పెన్షన్ డబ్బు చేతిలో పెట్టేవాడు. ఇప్పుడు వలంటీర్ రావడం లేదు. బ్యాంకుల వద్దకు పరుగు తీయాల్సి వస్తోంది. మండుటెండలో వృద్ధులు, వికలాంగులు, చివరకు అంధులు కూడా ఎవరో ఒకరి సాయంతో వెళ్లి క్యూలైన్‌లో నిలుచోవాల్సి వస్తోంది. ఇంతా చేసి బ్యాంకుకు వెళితే తమ అకౌంట్ క్లోజ్ అయ్యిందన్న చేదు వార్త వారిని చాలా ఆందోళనకు గురి చేస్తోంది. చక్కగా వలంటీర్ వచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేతిలో డబ్బు పెట్టి.. ఆప్యాయంగా పలకరించి మరీ వెళ్లేవాడు.

చంద్రబాబు చేసిన పనికి జగన్‌కి జై కొడుతున్న పెన్షన్‌దారులు..

బ్యాంకులో పలకరింపులు.. పరామర్శలూ ఉండవ్. చీదరింపులు తప్ప. ఇప్పుడు అకౌంట్లు ఆపరేషన్‌లోకి తీసుకు రావాలంటే పాన్, ఆధార్ కార్డ్ కాపీలు కావాలని బ్యాంక్ అధికారులు అడుగుతున్నారు. ఏదో పెన్షన్ డబ్బుతో బతికే చిన్న బతుకులు వారివి. వారికి ఈ జిరాక్సులు ఇవన్నీ అంటే ఏం తెలుస్తుంది. పెన్షన్ కోసం వెళ్లేవాళ్లు ఇవన్నీ పట్టుకుని ఎందుకు వెళతారు? ఈ ఎండలో తిరిగి ఇంటికి వెళ్లి అవన్నీ పట్టుకొచ్చి జిరాక్సులు తీయించడమంటే వారికి అయ్యే పనేనా? టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన పనితో పెన్షన్ దారులు నానా తంటాలు పడుతున్నారు.

చంద్రబాబు చేసిన పనికి జగన్‌కి జై కొడుతున్న పెన్షన్‌దారులు..

ఈ వయస్సులో అవ్వాతాతలను ఇంత ఇబ్బంది పెట్టడం అవసరసమా అనేది చంద్రబాబుకే తెలియాలి. జగన్‌కి ఎక్కడ మంచి పేరు వస్తుందో.. ఎక్కడ జగన్ లాభపడతాడో అని చూశాడు తప్ప.. ఇంతమందిని ఇబ్బంది పెట్టేది చంద్రబాబు చూడలేదు. దీంతో పెన్షన్ దారులంతా మూకుమ్మడిగా తమ ఓటు జగన్‌కేనని చెబుతున్నారు. వలంటీర్లు ఉన్నపుడు మా ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవారని.. ఇప్పుడు చంద్రబాబు కారణంగా 5 కి.మీ దూరంలో ఉన్న బ్యాంక్ దగ్గర క్యూలో నిలబడాల్సి వస్తోందని అవ్వాతాతలు ఆవేదన చెందుతున్నారు.

చంద్రబాబు చేసిన పనికి జగన్‌కి జై కొడుతున్న పెన్షన్‌దారులు..
చంద్రబాబు చేసిన పనికి జగన్‌కి జై కొడుతున్న పెన్షన్‌దారులు..