పెన్షన్ల పంపిణీని అడ్డుకుని.. మొసలి కన్నీరు కారుస్తున్న చంద్రబాబు..

పెన్షన్ల పంపిణీని అడ్డుకుని.. మొసలి కన్నీరు కారుస్తున్న చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు ఒక యమకింకరుడిలా తయారయ్యాడు. రాష్ట్రంలో దాదాపు 70 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వారిలో వృద్ధులు చాలా మంది ఉన్నారు. కనీసం ప్రభుత్వ కార్యాలయానికి వచ్చి పెన్షన్ తీసుకునే పరిస్థితి లేదు. అదే వలంటీర్లు ఉండి ఉంటే.. ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటికెళ్లి డోర్ కొట్టి మరీ పింఛన్లు అందించేవారు. కానీ వలంటీర్లపై కక్ష కట్టిన చంద్రబాబు.. వాళ్లుంటే తనకు ఎక్కడ ఇబ్బంది అవుతుందోనని కంగారు పడ్డారు. 

ఇంటికే వలంటీర్ల ద్వారా ప్రభుత్వ సేవలు అందితే.. ప్రతి ఇంటా సీఎం వైఎస్ జగన్ కొలువై ఉంటారనే భయంతో తన తాబేదారు మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌తో కలిసి స్కెచ్ గీశారు. కోర్టులను, ఎన్నికల సంఘాన్ని కలిసి పెన్షన్ల డోర్ డెలివరీని చేయకుండా అడ్డుకుని.. తన పన్నాగం ఫలించిందని సంబరపడ్డారు. ఒకటో తారీఖు రాగానే పెన్షన్ డబ్బులు పట్టుకుని వస్తాడనుకున్న వలంటీర్ రాకపోవడంతో పెన్షనర్లకు కడుపు మండింది. దీనికి చంద్రబాబే కారణమని తెలుసుకుని తమ ఆగ్రహాన్నంతా వెళ్లగక్కుతున్నారు. పైగా బాబుకు ఓటేస్తే పెన్షన్లు కూడా తీసేస్తాడని ప్రచారం జరిగింది. 

మొత్తానికి జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయిందని గుర్తించిన చంద్రబాబు దానిని దిద్దుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇప్పుడు పెన్షన్లు ప్రభుత్వ ఉద్యోగులతో ఇప్పించాలని చెబుతున్నారు. వృద్ధులు.. వికలాంగుల విషయంలో బాధ్యతగా ఉండాలని ప్రభుత్వానికి ఉచిత సలహాలు ఇస్తున్నారు. పెన్షన్ల పంపిణీకి కాలడ్డు పెట్టింది చంద్రబాబే.. తరువాత వాళ్లపట్ల మొసలి కన్నీళ్లు కారుస్తున్నది కూడా ఆయనే. చంద్రబాబు కుట్రలు ప్రజలు, ముఖ్యంగా ఓటర్లంతా గ్రహిస్తున్నారు. ఈసీతో చెప్పి డోర్ డెలివరీ ఆపించి లబ్దిదారుల ఉసురు పోసుకుని.. ఇప్పుడు ఉచిత సలహాలిస్తారా? అని ఏపీ ప్రజలు మండిపడుతున్నారు.