హాట్ టాపిక్‌గా పిఠాపురం.. గెలుపెవరిదో..!

హాట్ టాపిక్‌గా పిఠాపురం.. గెలుపెవరిదో..!

ఏపీలో ముఖ్యంగా పిఠాపురం స్థానం హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం అక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయడమే. అక్కడి నుంచి పవన్‌పై పోటీకి వంగా గీతను వైసీపీ రంగంలోకి దించింది. పవన్‌ను ఓడించడం కోసం వంగా గీత శత విధాలుగా యత్నిస్తోంది. ముఖ్యంగా పిఠాపురంలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండటం పవన్‌కు కలిసొస్తున్న అంశం. కాపులంతా పవన్‌కు సపోర్టుగా నిలుస్తున్నారు. అయితే టీడీపీ మాత్రం ఆయనకు సపోర్టుగా నిలవడం లేదని టాక్.

ఇక వంగా గీత విజయం కోసం వైఎస్సార్‌సీపీ కేడర్ శతవిధాలుగా యత్నిస్తోంది. మరోవైపు కాపు సామాజిక వర్గం నేత ముద్రగడ పద్మనాభం కూడా వైఎస్సార్‌సీపీని గెలిపించాలంటూ కాపులను కోరుతున్నారు. ఇక వంగా గీత కూడా నియోజకవర్గమంతా పర్యటిస్తూ జనాలను తమ వైపు తిప్పుుకునే యత్నం చేస్తున్నారు. నిన్న పవన్ వ్యాఖ్యలకు నేడు వంగా గీత కౌంటర్ ఇచ్చారు. నిజానికి వంగా గీత గతంలో ప్రజారాజ్యం పార్టీ కోసం పని చేశారు. 2009లో ప్రజారాజ్యం నుంచి చిరంజీవి ఆమెకు అవకాశం ఇచ్చారు.

Advertisement

ఈ క్రమంలోనే ఆమెను వైఎస్సార్‌సీపీని వీడి జనసేనలోకి రావాలని పవన్ పిలుపునిచ్చారు. దీనికి నేడు వంగా గీత కౌంటర్ ఇచ్చారు. తాను కూడా పవన్‌ను వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తాను 2009 నుంచే రాజకీయాల్లో ఉన్నానని.. అయితే 2009లో చిరంజీవి తనకు అవకాశం ఇచ్చారన్నారు. పిఠాపురంలో గెలుపుపై పవన్‌వి దింపుడు కళ్లెం ఆశలని వంగా గీత అన్నారు. నియోజకవర్గ ప్రజల మద్దతు తనకే ఉందని ఆమె వెల్లడించారు. ఇక ఈ పిఠాపురంలో గెలుపెవరిదనేది తెలియాలంటే ఒక రెండు నెలలు వెయిట్ చేయాల్సిందే..