Ponguleti Srinivas Reddy: తెలంగాణలో హాట్ టాపిక్‌గా పొంగులేటి.. పొలిటికల్ స్టాండ్‌పై లక్షల్లో బెట్టింగ్స్..

Ponguleti Srinivas Reddy: తెలంగాణలో హాట్ టాపిక్‌గా పొంగులేటి.. పొలిటికల్ స్టాండ్‌పై లక్షల్లో బెట్టింగ్స్.. 

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy).. జిల్లాను శాసించగల సత్తా ఉన్న నేత. రాష్ట్ర రాజకీయాల్లో సైతం కీ రోల్ పోషించగలరు.. పోనీ ఎంపీ కాకముందు ఏమైనా రాజకీయ నేపథ్యం ఉందా? అంటే అదీ లేదు. ఇప్పుడు రాష్ట్రంలోనే హాట్ టాపిక్‌గా మారారు.

బీఆర్ఎస్(BRS) పార్టీతో విభేదించి ఆత్మీయ సమావేశాలతో జనాలకు బాగా చేరువవుతున్నారు. మరోవైపు అధికార పార్టీకి జిల్లాలో చుక్కలు చూపిస్తున్నారు. ప్రతి మండలం నుంచి ఆయనకు మద్దతు ఉంది. పొంగులేటి(Ponguleti Srinivas Reddy) ఏ పార్టీలో చేరితే ఆ పార్టీలో చేరేందుకు నేతలతో పాటు ప్రజలంతా సిద్ధమవుతున్నారు. దీంతో ఆయన చేరబోయే పార్టీ ఏంటనే దానిపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. బీభత్సంగా బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయి. లక్షల్లో బెట్టింగ్‌లు కాస్తున్నారు. దీనిపై ఒపీనియన్ పోల్స్ సైతం కాక రేపుతున్నాయి. మొత్తానికి పొంగులేటి ఏ పార్టీలో చేరతారనేది.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్నంతగా హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy) వైసీపీ పార్టీ ఎంపీగా విజయం సాధించి ఆ తరువాత బీఆర్ఎస్‌లో చేరారు. కానీ ఎందుకోగానీ సీఎం కేసీఆర్(KCR).. నామా నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్‌లకు ఇచ్చిన ప్రాధాన్యం పొంగులేటి(Ponguleti Srinivas Reddy)కి ఇవ్వలేదు. బహుశా సామాజిక వర్గం పరంగా కూడా ఆయన ఆలోచించి ఉండవచ్చు. మొత్తానికి ప్రాధాన్యం లేకపోవడంతో పొంగులేటి పార్టీని వీడి బయటకు వచ్చారు. ఇది జరిగి కొన్ని నెలలవుతున్నా కూడా తన తదుపరి స్టెప్ ఏ వైపు ఉంటుందనేది మాత్రం వెల్లడించలేదు. కానీ వెళితే మాత్రం భారీగా జనంతోనే వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఈ సమయంలో ఆయన కాంగ్రెస్‌లో చేరుతారని కొందరు.. బీజేపీలో చేరుతారని కొందరు బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఎక్కువమంది కాంగ్రెస్‌పైనే బెట్టింగ్ కాస్తున్నారు. ఇక కొన్ని ఏజెన్సీలు, సంస్థలు ‘పొంగులేటి ఏపార్టీలో చేరుతారు..?’ ఏ పార్టీలో చేరితే బాగుంటుంది..’ ‘మీరైతే పొంగులేటిని ఏ పార్టీలో చేరమని సజెస్ట్ చేస్తారు..?’ వంటి ప్రశ్నలతో సోషల్ మీడియాలో ఒపీనియన్ పోల్స్ నిర్వహిస్తున్నాయి.