NTR: బాలయ్యను పక్కనబెట్టేసిన తెలంగాణ.. ఎన్టీఆర్‌కే పెద్ద పీట..

NTR: బాలయ్యను పక్కనబెట్టేసిన తెలంగాణ.. ఎన్టీఆర్‌కే పెద్ద పీట..

ఏపీ, తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏపీలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను మరిచారు. తమిళ్ సూపర్ స్టార్ రజినీ కాంత్‌‌ను ఆహ్వానించారు. ఇక్కడ నందమూరి బాలకృష్ణను హైలైట్ చేశారు.

ఇక తెలంగాణ రాజకీయం మరోలా ఉంది. ఇక్కడ బాలయ్యను పక్కనబెట్టేసి ఎన్టీఆర్‌ను హైలైట్ చేస్తున్నారు. ఖమ్మంలో 56 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించారు. ఈ విగ్రహావిష్కరణ త్వరలోనే జరగనుంది.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఇక్కడ ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ షూటింగ్ లొకేషన్‌కు వెళ్లి ఎన్టీఆర్‌ను కలిశారు. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయనున్నట్టు తెలిపి.. ఆయనను ముఖ్య అతిథిగా పువ్వాడ అజయ్ ఆహ్వానించారు.

NTR: బాలయ్యను పక్కనబెట్టేసిన తెలంగాణ.. ఎన్టీఆర్‌కే పెద్ద పీట..

ప్రస్తుతం ఎన్టీఆర్, పువ్వాడ అజయ్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం విగ్రహాష్కరణకు ఎన్టీఆర్ కుటుంబాన్ని మొత్తాన్ని పక్కనబెట్టేసి కేవలం ఎన్టీఆర్‌కు పెద్ద పీట వేసింది.

ఇక ఎన్టీఆర్ 30 ఒక యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా రెండో షెడ్యూల్ కూడా పూర్తైనట్టు టాక్. తాజాగా ఒక అద్భుత పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించినట్టు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!