పుంగనూరు సీన్ భీమవరంలో రిపీట్.. నాడు తండ్రి నేడు కొడుకు..!

పుంగనూరు సీన్ భీమవరంలో రిపీట్.. నాడు తండ్రి నేడు కొడుకు..!

నయానో భయానో తమ వైపు లాక్కోవాలి. ఏదో ఒక రకంగా విజయం సాధించాలనేది టీడీపీ అధినేత చంద్రబాబు కాన్సెప్ట్. నలభయ్యేళ్ళ రాజకీయ జీవితంలో అయన పాటించే సూత్రం ఇదే.. ఇన్నాళ్లుగా అయన ఇదే తరహాలో రాజకీయం చేస్తూ వస్తున్నారు. ఇకముందు కూడా అదే పాలసీ ఫాలో అవుతారు. ఇక ఇప్పుడు ఆశ్చర్యంగా చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఇదే మార్గంలో నడుస్తున్నారు. నారా లోకేష్ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. ఆయన తండ్రి ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి తద్వారా మూడు శాఖలకు అప్పట్లో మంత్రిని చేశారు. ఇప్పుడు ఆయన హింసను నమ్ముకుని, ప్రజల్ని బెదిరించి, కార్యకర్తలను ఉసిగొల్పి తన వీరత్వాన్ని చాటుకోవాలని చూస్తున్నారు.

పుంగనూరు సీన్ భీమవరంలో రిపీట్.. నాడు తండ్రి నేడు కొడుకు..!

చంద్రబాబు ప్లాన్ సక్సెస్..

అచ్చం మొన్న పుంగనూరులో జరిగినట్లే నేడు భీమవరంలో అల్లర్లకు ప్లాన్ చేశారు. మొన్నటికి మొన్న పుంగనూరు టౌన్‌లోకి వెళ్లేందుకు అనుమతులు తీసుమన్న పోలీసులను ఎదిరించి బెదిరించి చివరకు దాడి చేసి అయినా నగరంలోకి ప్రవేశించాలన్న చంద్రబాబు కుట్రలో పలువురు పోలీసులు గాయపడ్డారు. అయినా సరే.. ప్రజల దృష్టిలో తాను హీరో అవ్వాలనుకున్నారో ఏమో కానీ.. పోలీసుల పైకి కార్యకర్తలను రెచ్చగొట్టి చంద్రబాబు హింసకు ఆజ్యం పోశారు. ఫలితంగా వందలాది మంది టీడీపీ కార్యకర్తలు కేసులపాలయ్యారు. పదుల సంఖ్యలో పోలీసులు ఆస్పత్రిపాలయ్యారు. ఏదైతేనేం చంద్రబాబు ప్లాన్ సక్సెస్ అయింది. పుంగనూరులో చేసిన విధంగానే.. ఇప్పుడు పచ్చని గోదావరి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సారధ్యంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు.

Tdp In Bhimavaram2

ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవి..

లోకేష్ పాదయాత్ర సాగుతుండగానే కర్రలు.. బీర్ సీసాలతో వైసీపీ కార్యకర్తలమీద విరుచుకుపడ్డారు. రాళ్లతో దాడులు చేశారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు చించేస్తూ కేకలు.. అరుపులతో ఆ ప్రాంతాన్ని భయానకంగా మార్చేశారు. ఊహించని ఈ పరిణామానికి స్థానికులు బెంబేలెత్తిపోయారు. వైసీపీ కార్యకర్తలు సైతం భయంతో ఇళ్లలోకి వెళ్లి దాక్కున్నారు. దీనిని అడ్డుకునేందుకు యత్నించిన ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. హింసే కాదు.. నారా లోకేష్ భాష కూడా అలాగే ఉంది. ఒక్కొక్కడిని ఉచ్చ పోయిస్తాను.. ఎర్ర బుక్కులో పేర్లు రాస్తున్నాను అంటూ బెదిరిస్తూ తమ కార్యకర్తలను రౌడీల మాదిరి రెచ్చగొడుతున్నారు. ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద పదవి ఇస్తానంటూ టీడీపీ కార్యకర్తలకు లోకేష్ బూస్ట్ ఇస్తుండటంతో వారు రెచ్పిపోయారు. ప్రజల్లో తమ పార్టీకి ఉన్న పరపతి రోజురోజుకూ తగ్గిపోతుండడంతో.. ఇక గూండాగిరి ద్వారా అయినా ప్రజల్లో నిలవాలని నారా లోకేష్ ప్రస్తుతం తండ్రిని ఫాలో అవుతూ పాదయాత్ర సాగిస్తున్నారు.

Tdp In Bhimavaram3
Google News