రాప్తాడు సభతో దద్దరిల్లిన రాయలసీమ.. క్యాడర్, నాయకులకు మాంచి బూస్ట్

రాప్తాడు సభతో దద్దరిల్లిన రాయలసీమ.. క్యాడర్, నాయకులకు మాంచి బూస్ట్

అనంతపురం జిల్లా రాప్తాడు సభ ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సభకు లక్షలాది మంది జనం కదం తొక్కారు. నిజానికి వైసీపీకి రాయలసీమ కంచుకోటగా ఉంది. అందునా రాప్తాడుకు ప్రత్యేక స్థానముంది. అందుకే వైసీపీ అధినేత జగన్ ఏరి కోరి మరీ రాప్లాడులో సిద్ధం-3 సభను నిర్వహించారు. ఈ సభకు జనం పోటెత్తారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా తండోపతండాలుగా వచ్చి సభను సక్సెస్ చేశారు. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చి జగన్‌కు ఊపును, ఉత్సాహాన్ని ఇచ్చారు. జగన్ మాటలకు, పంచ్ డైలాగ్‌కు జనం విజిల్స్, కేకలతో హోరెత్తించారు. సభ జరిగిన మైదానానికి నలుదిక్కులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

రాప్తాడు సభతో దద్దరిల్లిన రాయలసీమ.. క్యాడర్, నాయకులకు మాంచి బూస్ట్

వైసీపీ శ్రేణుల్లో నూతనోత్సేజం..

మాట మాట్లాడితే టీడీపీ అధినేత చంద్రబాబు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఉంటారు. ఆయన నలభయ్యేళ్ల పాలనను జగన్ కడిగిపారేశారు. ప్రజలను వంచించి నమ్మించి గెలిచాక చంద్రబాబు ఎలా మాట మారుస్తారన్నది ఉదాహారణలతో సహా జగన్ ప్రజలకు వివరించారు. ఇటు చంద్రబాబు, అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఏకకాలంలో ఏకి పారేశారు. పంచ్ డైలాగ్స్‌తో విరుచుకుపడ్డారు. మొత్తానికి సిద్ధం సభల్లో జగన్ ప్రసంగాలు వైసీపీ శ్రేణుల్లో నూతనోత్సేజాన్ని నింపుతున్నాయి. ఎన్నికల యుద్ధానికి కథం తొక్కేలా చేస్తున్నాయి. జగన్ ప్రసంగాలు అభిమానులు, క్యాడర్, నాయకులకు మాంచి బూస్ట్ ఇస్తున్నాయి.

రాప్తాడు సభతో దద్దరిల్లిన రాయలసీమ.. క్యాడర్, నాయకులకు మాంచి బూస్ట్

అది వర్కవుట్ కాకపోవడంతో..

జగన్ ప్రసంగాలతో బీభత్సంగా మోటివేట్ అయిన కేడర్ రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల ప్రచార బరిలోకి దిగుతున్నారు. నిజానికి టీడీపీ చరిత్రలోనే ఇలాంటి సభ నిర్వహించడం జరగలేదు. దీంతో ఎలాగైనా జగన్‌కు వస్తున్న ఆదరణను తక్కువ చేసి చూపించేందుకు స్కెచ్ గీశాయి. ఈ క్రమంలోనే టీడీపీతో పాటు ఎల్లో మీడియా సైతం నానా తంటాలు పడుతోంది. సభ ప్రారంభంలోనే ఏవో ఫోటోలు, వీడియోలు పెట్టి జగన్ సభకు జనమే రాలేదని నమ్మించే ప్రయత్నం చేశాయి. అది వర్కవుట్ అవకపోవడంతో భయపెట్టి జనాన్ని తరలించారని ప్రజలను నమ్మించేందుకు యత్నించాయి. దీనికి వైసీపీ శ్రేణులు గట్టిగానే సమాధానం ఇస్తున్నాయి. జగన్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను అడ్డుకోవడమంటే అరచేతితో సూర్యకాంతిని అడ్డుకోవడమేనని చెబుతున్నాయి. తెలుగుదేశం.. ఎల్లోమీడియా ఎంత తాపత్రయపడినా యాగాశ్వం మాదిరి దూసుకుపోతున్న తమ పార్టీని నిలువరించలేరని జగనన్న సైనికులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.