కొడాలి నానికి షాక్… గుడివాడ నుంచి తప్పించారా?

కొడాలి నానికి షాక్… గుడివాడ నుంచి తప్పించారా?

వైసీపీలో చెప్పుకోదగిన నేతల్లో కొడాలి నాని ఒకరు. తమ పార్టీ అధినేత జగన్ మీద ఈగ కూడా వాలనివ్వరు. గుడివాడ ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేది. అలాంటిది కొడాలి నాని వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో గుడివాడ మొత్తం ఆయన కంచుకోటగా మారిపోయింది. గుడివాడలో కొడాలి నాని చేసిందే శాసనం. అలాంటి నానికి ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ చెక్ పెట్టబోతున్నారని టాక్. ఇది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అసలు ఇది నిజమేనా? అనేది చర్చనీయాంశంగా మారింది.

కొడాలి నానికి చెక్ పెట్టి సీన్‌లోకి ఎవరిని తీసుకురాబోతున్నారనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక గుడివాడ ప్రజలకైతే ఈ విషయమై క్లారిటీ ఉంది. పట్టణంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతరావు పేరిట పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. వాటిని చూసిన కొడాలి నాని అనుచరులకు మైండ్ బ్లాక్ అయ్యింది. హనుమంతరావు టికెట్ ఇవ్వడమేంటని వారంతా విస్మయం చెందుతున్నారు.

కొడాలి నానికి షాక్… గుడివాడ నుంచి తప్పించారా?

అయితే హనుమంతరావుకు సీఎంఓ నుంచి పిలుపొచ్చిందని.. ఆయనకు సీటు ఫిక్స్ అంటూ ఆయన వర్గం నేతలంతా చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో సైతం హనుమంతరావుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆయనకు గుడివాడ టికెట్ ఫిక్స్ అయినట్టేనని నియోజకవర్గంలో అంతా చెప్పుకుంటున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జుల మార్పులు, చేర్పుల్లో భాగంగా కొడాలి నానిని తొలగించారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే తనకు టికెట్ దక్కకున్నా కూడా జగన్ భక్తుడిగా ఉండిపోతానని కొడాలి నాని కూడా చెప్పేశారు. మరి ఈ వార్తల్లో నిజమెంతనేది తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.

Google News