అటు రేవంత్.. ఇటు ఈటల.. కేసీఆర్‌కు పెద్ద సవాలే..

అటు రేవంత్.. ఇటు ఈటల.. కేసీఆర్‌కు పెద్ద సవాలే..

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఈసారి అసెంబ్లీ ఎన్నికలైతే ఇజ్జత్ కా సవాల్. బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడం ఒక ఎత్తైతే.. తాను గెలవడం మరో ఎత్తు. అసలే హ్యాట్రిక్ సీఎంగా హిస్టరీ క్రియేట్ చేయాలని తహతహలాడుతున్న కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రూపంలో ఉపద్రవం పొంచి ఉంది. వీరిద్దరూ ఒకరు కామారెడ్డిలో.. మరొకరు గజ్వేల్‌ నుంచి కేసీఆర్‌పై పోటీకి బరిలో దిగారు. ఎలాగైనా సరే కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా శక్తియుక్తులన్నీ ఒడ్డుతున్నారు. 

మరోవైపుప అటు రేవంత్, ఇటు ఈటల ఇద్దరూ కేసీఆర్ చేత అవమానించబడిన వారే. కేసీఆర్‌పై గెలవడం ద్వారా తమ అవమాన భారాన్ని తొలగించుకోవాలని చూస్తున్నారు. రేవంత్ తక్కువ వాడేం కాదు. తెలంగాణలో అస్తవ్యస్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని గాడిన పడేసిన దిట్ట. అధిష్టానానికి సైతం తెలంగాణలో పార్టీ విజయం సాధిస్తుందని నమ్మకం కలిగించారు. కేసీఆర్‌కు అత్యంత బలమైన శత్రువు కూడా కావడం గమనార్హం. అందునా తెలంగాణ ఇచ్చిన పార్టీగా జనంలో కాంగ్రెస్‌కు మంచి పేరు ఉంది. రేవంత్ దానినే ఇప్పుడు అస్త్రంగా వినియోగిస్తున్నారు.

ఇక ఈటల కూడా తక్కువేం కాదు. ఒకప్పుడు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరారు. ఆ సమయంలో ఆయన నియోజకవర్గంలో ఉప ఎన్నిక రాగా.. ఆయనను ఓడించేందుకు కేసీఆర్ గట్టి ప్రయత్నమే చేశారు. కొన్ని నెలల పాటు తమ మంత్రులందరినీ హుజూరాబాద్‌లో మోహరించారు. అయినా సరే.. ఈటల ఘన విజయం సాధించారు. అలాంటి నేత ఇప్పుడు కేసీఆర్‌పై పోటీకి దిగారు. ఒకవైపు రేవంత్, మరోవైపు ఈటల రూపంలో కేసీఆర్‌కు ప్రమాదం పొంచి ఉంది. కేసీఆర్ గెలిచి నిలవడం అనేది కాస్త కష్టమైన పనే. ఇక చూడాలి ఏం జరుగుతుందో..

Google News