విశాఖలో పెద్ద ఎత్తున పట్టుబడిన గంజాయి.. అనుమానాలన్నీ టీడీపీపైనే..?

విశాఖలో పెద్ద ఎత్తున పట్టుబడిన గంజాయి.. అనుమానాలన్నీ టీడీపీపైనే..?

మొన్నటికి మొన్న పెద్ద ఎత్తున డ్రగ్స్ ఇక నిన్న పెద్ద ఎత్తున గంజాయి ఏపీలో లభ్యమైంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ గురువారం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని పట్టుకుని అతని వద్ద ఉన్న బ్యాగును పరిశీలించారు. దానిలో 16 కిలోల గంజాయి ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు. గంజాయిని స్వాధీనం చేసుకుని ఆ వ్యక్తిని ఆర్పీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకుంది. విశాఖపట్నం – అనకాపల్లి మార్గం మధ్యలో ఓ ప్రయాణికుడు అనుమానాస్పదంగా కనిపించడంతో రైల్వే అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.

సదరు వ్యక్తి విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా ఢిల్లీకి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. అంతకుముందు, మార్చి 21 న కొయ్యూరులోని డౌనూరు పంచాయతీలో 17 బస్తాల్లో ప్యాక్ చేసిన 532 కిలోల గంజాయిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 26.60 లక్షలు. ఈ కేసులో పాంగి సుందర్‌రావు, వంతల చిన్నా, పాంగి మాణిక్యం అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా.. ఒకరు పరారీలో ఉన్నారు. ఒరిస్సా సమీపంలోని నేరేడుపల్లి నుంచి గుర్రాల మీదుగా కొయ్యూరు మండలం బచ్చెంటకు గంజాయి తరలిస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

ఈ మొత్తం వ్యవహారం వెనుక టీడీపీ ఉన్నట్టు సమాచారం. మొన్న కూడా విశాఖ తీరంలో ఒకటి కాదు… రెండు కాదు.. 25 వేల కేజీల డ్రగ్స్‌ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ డ్రగ్స్ స్కాంలో టీడీపీ నేతలకు నేరుగా లింకులు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో నిన్న పట్టుబడిన గంజాయి వెనుక కూడా టీడీపీ హస్తం ఉందేమోనన్న అనుమానాలు తలెత్తుతు్నాయి. 25 కేజీలు డ్రగ్స్ పట్టుబడిన కేసులో టీడీపీ నేతలు దామచర్ల సత్య, లావు శ్రీ కృష్ణ దేవరాయలు, రాయపాటి జీవన్ లతో నిందితుడు కోటయ్య చౌదరికి దగ్గర సంబంధాలున్నట్టు పోలీసులు గుర్తించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకి దామచర్ల సత్య అత్యంత ఆప్తుడు. ఇక ఈ కేసులో చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు నేరుగా సంబంధం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఈ కేసులో నందమూరి, దగ్గుబాటి కుటుంబాల పేర్లు కూడా వినిపించాయి. దీంతో నిన్న దొరికిన గంజాయి కేసు కూడా టీడీపీ నేతల చుట్టే తిరుగుతోంది.