వైసీపీ మేనిఫెస్టో: జగన్ విశ్వసనీయతే ప్రధాన అస్త్రం
ఆంధ్రప్రదేశ్‌లో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నేడు ఆయన తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ మేనిఫెస్టో 2024ను విడుదల చేశారు. కోవిడ్ వంటి కష్ట కాలంలో సైతం ప్రజలకు అండగా ఉన్నామని జగన్ తెలిపారు. ఎలాంటి కష్ట సమయంలోనూ సాకులు చెప్పకుండా సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. 2019లో ఇచ్చిన హామీలను దాదాపు అమలు చేశామన్నారు. తాను మోసపూరిత హామీల్లో చంద్రబాబుతో పోటీ పడలేకపోయానని జగన్ తెలిపారు.
నేను హీరో!!
చరిత్రలో చరిత్ర హీనుడిగా మిగిలిపోకుండా ఉండేందుకు మాత్రమే తాను ఏం చెప్పానో అదే చేశానన్నారు. అమలు చేసినా చేయకున్నా చంద్రబాబు మాదిరిగా హామీలు ఇచ్చేద్దామని చాలా మంది చెప్పినా కూడా తాను వినలేదని జగన్ తెలిపారు. అలాగే 2019లో చేయగలిగిందే చెప్పానన్నారు. చెప్పిందంతా చేసి చూపించి హీరోగా జనాల్లోకి వెళుతున్నానన్నారు. ఇచ్చిన ప్రతి మాటా అమలు చేస్తూ ముందుకు వెళ్లడమే లీడర్ షిప్ అని జగన్ పేర్కొన్నారు. తన పాదయాత్రలో ఎన్నో కష్టాలు చూశానని.. పిల్లలను చదివించాలని ఉన్నా చదివించలేని తల్లుల పరిస్థితిని కళ్లారా చూశానన్నారు. తాను చూసిన పరిస్థితులన్నింటికీ 58 నెలల కాలంలో పరిష్కారం చూపానన్నారు. పేదలకు సంక్షేమం అందించానని.. అర్హులను జల్లెడ పట్టి మరీ వెతికి సంక్షేమాన్ని అందించినట్టు జగన్ తెలిపారు.
2 పేజీలు, 9 హామీలు
- వైఎస్సార్ చేయూత రూ.75 వేల నుంచి రూ. లక్షా 50 వేలకు పెంపు
- వైఎస్సార్ కాపు నేస్తం నాలుగు దఫాల్లో రూ. 60 వేల నుంచి లక్షా 20 వేల వరకు పెంపు
- వైఎస్సార్ ఈబీసీ నేస్తం నాలుగు దఫాల్లో రూ.45 వేల నుంచి రూ.లక్షా 5 వేలకు పెంపు
- అమ్మ ఒడి రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంపు
- వైఎస్సార్ సున్నావడ్డీ కింద రూ.3 లక్షలు వరకు రుణాలు
- రెండు విడతల్లో పెన్షన్ రూ.3,500కు పెంచబోతున్నట్టు ప్రకటన
- వైఎస్‌ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగించనున్నట్టు జగన్ ప్రకటన