రేవంత్, కేటీఆర్‌ల నోట ఒకటే మాట..
రెండు భిన్న ధృవాలు. రాజకీయాల్లో ఆకర్షించుకోవడాలు ఉండవ్. సైన్స్ సూత్రం ఇక్కడ వర్తించదు. కేవలం వికర్షణలే. కానీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రి కేటీఆర్‌లు మాత్రం ఒకటే మాట చెబుతున్నారు. మరి ఎవరి మాట నెగ్గుతుందో చూడాలి. గతంలో అయితే కేటీఆర్ చెప్పినట్టే అక్షరాలా జరిగింది. కానీ పరిస్థితులు ఇప్పుడు మారిపోయాయ్. కేటీఆర్ చెప్పింది జరిగే పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఏం చెప్పారు?
డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోందని రేవంత్ తెలిపారు. ఆయనైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ఫుల్ ధీమాతో అయితే ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో 80-85 సీట్లలో నెగ్గి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని నిన్న జరిగిన మీట్ ది ప్రెస్‌లో రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇదే విషయాన్ని తాజాగా మంత్రి కేటీఆర్ కూడా తెలిపారు. తమ పార్టీ 85 సీట్లతో అధికారంలోకి రావడం పక్కా అని వెల్లడించారు. ఇప్పుడు ఇద్దరి మాటలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
రేవంత్, కేటీఆర్ ఇద్దరి మాటల్లో ఎవరివి నిజమవుతాయంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు పక్కా రేవంత్ మాటలే నిజమవుతాయని అంటుంటే.. కొందరు కేటీఆర్‌కు సపోర్టుగా నిలుస్తున్నారు. దీనిపై జోరుగా పందాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కేటీఆర్ 90 సీట్లు తమ పార్టీ పక్కా గెలుచుకుంటుందని చెప్పారు. ఆ సమయంలో ఆయన ఆ బాధ్యతను భుజాలపై వేసుకుని మరీ 90 సాధించారు. ఇప్పుడు కూడా అలాగే చెప్పిన మాట ప్రకారం సాధిస్తారంటున్నారు. ఇక చూడాలి ఎవరి మాట నిజమవుతుందో..