నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా శరత్ చంద్రారెడ్డి?

నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా శరత్ చంద్రారెడ్డి?

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే హడావుడిగా అభ్యర్థులను ఫిక్స్ చేస్తున్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేసి ప్రచార బరిలోకి దింపాలనేది జగన్ ఆలోచన.విపక్షాలు పొత్తుల అంశాన్ని తేల్చుకోకముందే ప్రచారంలోకి దిగిపోవాలని జగన్ యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించిన ఏడు జాబితాలను ఆయన విడుదల చేశారు.

ప్రజల్లో వ్యతిరేకత ఉందని తెలిసిన ప్రతి నేతనూ జగన్ పక్కనబెట్టేస్తున్నారు. సర్వేలు చేసి మరీ గెలుపు గుర్రాలకే అవకాశం ఇస్తున్నారు. ఇక మార్పులు, చేర్పుల్లో భాగంగా నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయించబోతున్నారు. ఇక ఆ స్థానం నుంచి తొలుత రాజ్యసభ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పోటీ చేయించబోతున్నారని టాక్ నడిచింది.

అయితే వేమిరెడ్డి తన అనుచరుడితో పాటు తన సతీమణికి టికెట్ ఇవ్వాలని కోరడంతో ఆయనను పక్కనబెట్టేశారు. దీంతో ఆ స్థానంలో విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డిని బరిలోకి దింపాలని భావిస్తున్నారట. అయితే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుల్లో ఒకరిగా శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. ఆయనను ఎంపీగా బరిలోకి జగన్ దింపుతున్నారనే విషయం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Google News