ట్రెండింగ్ లో సిద్ధం… ఆన్లైన్లోనూ, ఆఫ్లైన్లోనూ

ట్రెండింగ్ లో సిద్ధం… ఆన్లైన్లోనూ, ఆఫ్లైన్లోనూ

“సిద్ధం”… ఎన్నికల సమరానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పూరించిన శంఖారావం. రాప్తాడులో ఎటూ చూసిన జన హోరు. సోషల్ మీడియాలో కూడా అదే జోరు.

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వేళ వైసీపీ సిద్ధం సభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండు సభలను నిర్వహించిన జగన్.. నేడు రాప్తాడులో మూడో సభ నిర్వహించారు. ఈ సభకు జనం పోటెత్తారు. సభను గ్రాండ్ సక్సెస్ చేశారు. ఇక ఈ సభ మరోవైపు సోషల్ మీడియాను సైతం షేక్ చేస్తోంది. రాప్తాడు సిద్దం సభ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండిం‌గ్‌లో ఉంది. సిద్ధం సభ ఫోటోలతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. వైసీపీ అభిమానులు కార్యక్రమానికి వచ్చి ఆ ప్రాంతాన్ని ఫోటోలు తీసి ట్విటర్‌, ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు.

ట్రెండింగ్ లో సిద్ధం… ఆన్లైన్లోనూ, ఆఫ్లైన్లోనూ

ట్విటర్‌లో సిద్ధం హ్యాష్‌ట్యాగ్ దేశంలోనే నంబ‌ర్‌వ‌న్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. సీఎం జ‌గ‌న్ ఆధ్వ‌ర్యంలో సిద్ధం-3 సభ జరిగింది. ఈ సభకు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. కార్య‌క్ర‌మానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ హాజ‌రుకాక‌ముందే సిద్ధం అప్‌డేట్స్ సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపాయి. జ‌గ‌న‌న్న రంగంలోకి దిగితే గ్రౌండ్‌లోనే కాదు సోష‌ల్ మీడియాలో కూడా షేక్ చేయ‌గ‌ల‌మ‌ని ఒక అభిమాని పేర్కొన్నారు. మరో అభిమాని వచ్చేసి.. ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్ జ‌గ‌న‌న్న ఈస్ రోరింగ్‌లైన్ అని మ‌రో అభిమాని అన్నాడు.

ఈ స‌భ‌కు రాయ‌ల‌సీమ జిల్లాల నుంచి భారీస్థాయిలో నాయ‌కులు, అభిమానులు, ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చారు. కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన వారు ఆ ప్రాంతాన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దాంతో జాతీయస్థాయిలో ట్విట్టర్లో “సిద్ధం” హాష్ టాగ్ ట్రెండింగ్ లో నడుస్తోంది. ఫేస్‌బుక్‌లో, ఇన్ స్టాగ్రామ్ లో కూడా అదే సందడి.

రాయలసీమ అంటేనే వైసీపీకి కంచుకోట. ముఖ్యంగా రాప్తాడుకు పొలిటికల్‌గా సమ్‌థింగ్ స్పెషల్. అందుకే సిద్ధం-3 కోసం రాప్తాడును జగన్ ఎంచుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభను గ్రాండ్ సక్సెస్ చేశారు. జగన్ సభా ప్రాంగణానికి చేరుకున్న వెంటనే కార్యకర్తల వద్దకు వెళ్లి వారికి ఎన్నికలకు సంబంధించిన దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశామని జగన్ తెలిపారు. పేదల పక్షాన యుద్ధానికి సిద్దం కావాలని కేడర్‌కు జగన్ పిలుపునిచ్చారు. మొత్తానికి సిద్ధం సభతో వైసీపీ కేడర్‌లో ఫుల్ జోష్ నింపుతున్నారు.

“ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్ జ‌గ‌న‌న్న ఇస్ రోరింగ్‌లైన్” అంటూ వైఎస్సార్సీ పార్టీ అభిమానులు సంబరపడుతున్నారు.