సీన్ రివర్స్.. పవన్ అనుకున్నదొక్కటి అయినదొక్కటి.. సేనానిపై కన్నెర్రజేస్తున్న కాపులు..!

సీన్ రివర్స్.. పవన్ అనుకున్నదొక్కటి అయినదొక్కటి.. సేనానిపై కన్నెర్రజేస్తున్న కాపులు..!

కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాపు సామాజిక వర్గం మండిపడుతోంది. పవన్‌పై పెద్ద ఎత్తున విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

పవన్ గాలిలో కత్తులు తిప్పుతూ యుద్ధం చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన వెంట వచ్చే అశేష సేనా వాహినిని వెర్రి వాహినిగా అభివర్ణిస్తూ వారందరితో యుద్ధానికి బయలుదేరారన్నారు. నాలుగు రోజుల్లోనే బండారం బయటపడినా డాంబికాలతో కవర్ చేద్దామనుకుంటూ బొక్క బోర్లా పడ్డారంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. నాయకులకు సంకెళ్లు వేసి కొట్టుకుంటూ రోడ్ల మీద తీసుకెళతానన్న పవన్‌కు నాయకుడి లక్షణం లేదని తానే క్లారిటీ ఇచ్చాడన్నారు.

ఏళ్ల తరబడి కాపు ఉద్యమాన్ని నడిపిస్తున్న ముద్రగడ పద్మనాభం వంటి వారిని అవమానిస్తున్న పవన్ ఎప్పటికీ చంద్రబాబుకు పాలేరేనని కాపు నేతలు అంటున్నారు. గతంలో టీడీడీ హయాంలో ముద్రగడను.. ఆయన భార్య, కోడలు సహా కుటుంబాన్ని అరెస్ట్ చేసి పోలీసులు రోడ్డుపై దూషించిన నాడు సైతం పవన్ టీడీపీ సర్కారులో భాగస్వామిగా ఉన్నారన్నారు. పవన్‌కు కాపుల మీద అంత ప్రేమ ఉంటే.. ఆనాడే ముద్రగడకు దన్నుగా నిలవాల్సింది పోయి చంద్రబాబు దసరా మామూళ్లు లెక్కలేసుకుంటూ ఉండిపోయారని ఎద్దేవా చేశారు.

నేడు మళ్లీ పవన్ ముద్రగడను విమర్శించడానికి కారణం మామూళ్ల కోసమేనని కాపు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏనాడూ స్వలాభం కోసం కులాన్ని వాడుకోని ముద్రగడ, ఎప్పుడు ఉద్యమానికి అవసరం అయితే అప్పుడు మేమున్నాం అంటూ అన్నిరకాల అండదండలు సమకూర్చిన ద్వారంపూడి వంటివాళ్ళును వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అవమానిస్తున్నాడంటూ పవన్‌పై విరుచుకుపడ్డారు. పవన్.. టీడీపీ వాళ్ళు ఇచ్చిన ప్రసంగం చదవడం, ఆ రోజు పేమెంట్ తీసుకుని వెళ్లిపోవడం తప్ప ఇంకేమీ లేదని కాపు యువతకు సైతం అర్థం అయిందని కాపు నేతలు అంటున్నారు.

Google News