పవన్‌ కల్యాణ్‌ స్క్రిప్ట్ అంతా చంద్రబాబు ఇంటి నుంచే..!

పవన్‌ స్క్రిప్ట్ అంతా చంద్రబాబు ఇంటి నుంచే..: వైసీపీ దిమ్మతిరిగే కౌంటర్..

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు వైసీపీ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. పవన్‌ను ప్యాకేజీ స్టార్ అని ఎందుకు అంటారో రుజువులతో సహా వెల్లడించింది. పవన్ స్పీచ్ అంతా చంద్రబాబు ఇంటి నుంచే వస్తోందని తెలిపింది. పవన్ వ్యాఖ్యల్లో నిజం ఉంటే ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేయవచ్చంటూ సవాల్ విసిరింది. పవన్ కల్యాణ్‌కి నాలుక మడతేయటం చాలా ఈజీ, ఎల్లో మీడియాకు అతన్ని వాడుకోవటం అంతకన్నా ఈజీ అంటూ వైసీపీ ఎద్దేవా చేసింది.

పవన్‌కు వైసీపీ కౌంటర్లు ఇవే..

సీఎం జగన్ దత్తపుత్రుడు అనే పేరు ఎందుకు పెట్టారో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను ఒకసారి చూస్తే అర్థమవుతుంది. జగన్‌ని పంపించేద్దామని ఈనాడు.. ఓటర్లు కులపరంగా విడిపోవద్దని జ్యోతి రాశాయి. ఇవన్నీ చూస్తే ఎవరి ఎజెండా కోసం పవన్ పని చేస్తున్నారో అర్థమవుతుంది.

గతంలో పవన్ చంద్రబాబు ప్రభుత్వం తనను హత్య చేయడానికి యత్నిస్తోందంటూ చేసిన విమర్శలనే ఇప్పుడు జగన్ ప్రబుత్వం మీద కూడా చేస్తున్నాడు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే పవన్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.

పవన్ ఇప్పటికే చంద్రబాబు ఇంటికి వెళ్లి మరీ సీట్లు, డబ్బుల ప్యాకేజీ మాట్లాడుకున్నాడు. ఇక మిగిలింది డైలాగులు. పవన్ స్పీచ్ అంతా చంద్రబాబు ఇంటి నుంచే వస్తోంది. నేను ఎమ్మెల్యే కావాలని మొదటి రోజు స్క్రిప్ట్ అక్కడ నుంచే వచ్చింది. అంటే.. సీఎం రేసులో పవన్ లేడని పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ నిరాశపడి వెనక్కి వెళ్లిపోతున్నారని అర్థంకాగానే.. ఎలాగూ టీడీపీతో కలిసే వెళ్తాడు కాబట్టి మీరు చేస్తే నేను ముఖ్యమంత్రి అవుతా అంటూ మరో డైలాగ్‌ కూడా టీడీపీయే పవన్ కల్యాణ్‌తో చెప్పించింది.

జగన్‌ గారి పాలన మీద పవన్ కల్యాణ్‌ నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. ఈ వ్యాఖ్యల్లో నిజం ఉంటే.. పవన్ కల్యాణ్‌ ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేయొచ్చు కదా. మరి ఆ పని ఎందుకు చేయట్లేదు? రాష్ట్రం మొత్తం మీద టీడీపీ చెప్పినట్లు సెలక్టివ్‌గా పోటీ చేసి తన సీటు కూడా తాను గెలవలేని వాడు వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీకి ఎన్ని ఓట్లు తగ్గుతాయో తన చిలకతోనో,ఎలకతోనో ఒక జ్యోతిష్యం చెప్పిస్తాడు.

Pawan Kalyan meeting

జగన్ గారి ప్రభుత్వంలో ఇప్పటికే 2.16 లక్షల కోట్ల డీబీటీ జరిగిందా? లేదా? ఇటువంటి మేలు చరిత్రలో ఎప్పుడైనా ఇంటింటికీ జరిగిందా అన్న ప్రశ్నకు సమాధానం లేదు కాబట్టే.. ఇసుక, మద్యం అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నాడు.

ఇక క్లాస్‌వార్‌కు సంబంధించి పవన్‌ కల్యాణ్‌కు చారుమంజుదార్‌, తరిమెల నాగిరెడ్డి గుర్తుకు వచ్చారు. చంద్రబాబే ఆయనకు చేగువేరా. నారాజమిందారే చారుమంజుదార్. పుచ్చిన బుర్ర చంద్రయ్యే పుచ్చలపల్లి సుందరయ్య. ఆయన ఇచ్చే తీర్థం, ప్రసాదం, పుష్పం, ఫలం, గోదానం, భూదానం అన్నీ అందుకుని పార్టీ ఆఫీసు, వ్యక్తిగత సెటిల్‌మెంట్లు అన్నీ చేసుకున్నాడు కాబట్టే.. ఇప్పుడు ఈ నారా జమీందార్‌, ఈ చంద్రగువేరా అనేవాడు అత్యంత ప్రీతిపాత్రుడుగా కనిపిస్తున్నాడు.

Google News