ఇదేం ట్విస్ట్? షర్మిలకు చంద్రబాబు దూరపు చుట్టంతో వియ్యమా?

ఇదేం ట్విస్ట్? షర్మిలకు చంద్రబాబు దూరపు చుట్టంతో వియ్యమా?

రాజకీయాలు వేరు.. వ్యక్తిగత జీవితం వేరు. ఎప్పుడు ఎక్కడ ఎలా కలుస్తారో తెలియదు.. ఎలా జర్నీ ప్రారంభమవుతుందో తెలియదు.. పెళ్లి జరిగేది మాత్రమే తెలుస్తుంది. అందుకే అంటారు పెద్దలు.. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని. ఈ గోలంతా ఎందుకంటారా? తెలుగు రాష్ట్రాల్లో ఓ పెళ్లి హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి అసలు దానిలో నిజమెంతో కానీ ఒక్క ఫోటోతో గడప దాటి ప్రపంచాన్ని అయితే చుట్టేస్తోంది. వైఎస్ షర్మిల ముద్దుల కుమారుడు పెళ్లికి సిద్ధమవుతున్నాడట. అమెరికాలో ఓ యువతితో స్నేహం కాస్తా ప్రేమగా మారిందట. వారిద్దరికీ సంబంధించిన ఫోటో ఒకటి బయటకు రావడంతో ఇంకేముంది పెళ్లి ఫిక్స్..షర్మిల దంపతులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారంటూ టాక్ నడుస్తోంది.

ఇంటి పేరు ఎక్కడో విన్నట్టుంది కదా…

Advertisement

దీనిలో ఏముంది? ఇది కామనే కదా అంటారా? ఆ అమ్మాయి ఎవరనేదే హాట్ టాపిక్. ఆమె టీడీపీ అధినేత చంద్రబాబు దూరపు చుట్టమట. ఆహా.. ఎక్కడి నుంచి ఎక్కడకు ఆ దేవుడు లింక్ పెట్టాడు. అనిపిస్తోంది కదా. నిజానికి ఫోటో చూశాక అందరిలోనూ కేవలం అనుమానాలే. అయితే ఆ అమ్మాయికి విజయమ్మ చీర పెట్టిన ఫోటో బయటకు రావడంతో ఇంకేముంది? పెళ్లి ఫిక్స్ అని నెటిజన్లు భావిస్తున్నారు. రాజారెడ్డితో ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు ప్రియా అట్లూరి. ఇంటి పేరు ఎక్కడో విన్నట్టుంది కదా. ఆమె ఎవరో కాదు.. తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన ఛట్నీస్‌ రెస్టారెంట్‌ నిర్వాహకుడు అట్లూరి ప్రసాద్ మనవరాలు. రాజారెడ్డితో పాటే అమెరికాలో ప్రియా మాస్టర్స్ పూర్తి చేసింది.

మరింత ఆసక్తికరంగా పెళ్లి..

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన ఓ కార్యక్రమానికి తల్లితో కలిసి వెళుతుండగా.. రాజా రెడ్డి ఫోటోలు బయటకు వచ్చాయి. హీరోలా ఉన్నాడంటూ జనం అతడిని ఆకాశానికి ఎత్తారు. ఈ హీరోను తొలుత ఏపీ సీఎం జగన్ తన ఇంటి అల్లుడిని చేసుకుంటారన్న ప్రచారం అయితే నడిచింది. ఏమైందో ఏమో కానీ ఆ తరువాత ఇరు కుటుంబాల మధ్య పెళ్లి ఊసే లేదు. ఆ తరువాత అన్నాచెల్లెళ్లు ఎవరికి వారై పోయారు. ఇప్పుడు ప్రియాతో పెళ్లి కాబోతోందని టాక్. చట్నీస్ సంస్థల అధినేత ప్రసాద్ టీడీపీ అధినేత చంద్రబాబుకు దూరం చట్టమని తెలుస్తోంది. దీంతో ఈ పెళ్లి మరింత ఆసక్తికరంగా మారింది. ఇదే నిజమైతే మాత్రం అన్న జగన్‌కు షర్మిల మాంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టువుతుందని జనం చర్చించుకుంటున్నారు. ఇక చూడాలి ఇది కేవలం రూమరేనా? నిజమా? అనేది.