సింగరేణి ఎన్నికలు ప్రారంభం.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వార్ షురూ..

సింగరేణి ఎన్నికలు ప్రారంభం.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వార్ షురూ..

సింగరేణి ఎన్నికలు నేటి ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. తెలంగాణలోని మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీల బలాబలాలను పరోక్షంగా ఈ ఎన్నికలు తేల్చనున్నాయి. నేటి సాయంత్రం 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అనుబంధ ఐఎన్‌టీయూసీ, సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ, బీఆర్‌ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్‌ ముఖ్యంగా పోటీపడుతున్నాయి. మొత్తం 39,773 మంది కార్మికులు ఈ ఓటింగ్‌లో పాల్గొననున్నారు.

తొలి ఫలితం ఇల్లెందు డివిజన్‌ నుం.. తుది ఫలితం శ్రీరాంపూర్‌ నుంచి వచ్చే అవకాశం ఉంది. ప్రతిసారి కూడా ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగానే మారుతున్నాయి. గతంలో ఆరుసార్లు సింగరేణిలో ఎన్నికలు జరిగాయి. కార్మిక సంఘాలకు మాతృ సంస్థలుగా రాజకీయ పార్టీలు ఉండటమే దీనికి కారణం. సింగరేణి ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్‌గా జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్.. సింగరేణి ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్‌ను దెబ్బ తీయాలని పట్టుదలతో ఉంది.

సింగరేణి ఎన్నికలు ప్రారంభం.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వార్ షురూ..

ఈ క్రమంలోనే  సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీకి బీఆర్‌ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్‌ మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. కాంగ్రెస్‌ అనుబంధ ఐఎన్‌టీయూసీని ఓడించేందుకు బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. తొలుత ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న బీఆర్ఎస్ అనంతరం నిర్ణయం మార్చుకుంది. తిరిగి పోటీ చేయనున్నట్టు టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అప్పుడు బీఆర్ఎస్‌ను ఓడించాలని డిసైడ్ అయిన సీపీఐ ఇప్పుడు కాంగ్రెస్‌ను ఓడించేందుకు అదే బీఆర్ఎస్‌తో జత కట్టింది. ఇక చూడాలి ఏం జరుగుతుందో..

Google News