జనసేన ఈసారైనా సత్తా చాటుతుందా?

జనసేన ఈసారైనా సత్తా చాటుతుందా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందన్న విషయమై చర్చలు పెద్ద ఎత్తున జరగుతున్నాయి. పవన్ తన పార్టీని హైదరాబాద్ వేదికగా హైటెక్ సిటీ సమీపంలో నోవాటెల్ భవనంలో 2014 మార్చి 14న  ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి రాజకీయాల్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకైతే అది జరగలేదు. ఈసారి ఎన్నికలు జనసేనకు ప్లస్ అవుతాయా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుంది.

ఈ పొత్తు జనసేనకు లాభిస్తుందా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబే సీఎం అని నారా లోకేష్ చెప్పినప్పటి నుంచి దీంతో జనసేనలో కలకలం ప్రారంరభమైంది. అసలు జనసేనకు పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు రావొచ్చనేది చర్చనీయాంశంగా మారింది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. టీడీపీ ఇచ్చిన సీట్లలో కూడా జనసేన ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అలాగే జనసేనకు బలమున్న స్థానాలు దక్కుతాయా? లేదా? అనేది కూడా సందేహంగా మారింది.

విజయనగరం జిల్లాలో జరిగిన యువగళం ముగింపు సభంలో ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు చేసిన కామెంట్స్ కూడా హాట్ టాపిక్‌గా మారాయి. టీడీపీ సొంతంగానే 160 సీట్లను గెలుచుకుంటుందట. అంటే కేవలం 15 సీట్లే జనసేన గెలుచుకుంటుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. టీడీపీకి ఏమాత్రం బలం లేదు అనుకున్న స్థానాలను మాత్రమే జనసేనకు ఇస్తుందని అప్పటి నుంచి టాక్ నడుస్తోంది. ఇదే జరిగిందో జనసేన గెలుపు ఈసారి కూడా ఒకటో అరకో పరిమితమవుతుందని అంటున్నారు. చూడాలి ఇక ఏం జరుగుతుందో.. 

Google News