ఆర్జీవీ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తల హల్‌చల్.. దిష్టి బొమ్మ తగులబెట్టి హంగామా

ఆర్జీవీ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తల హల్‌చల్.. దిష్టి బొమ్మ తగులబెట్టి హంగామా

ఫిలింనగర్‌లోని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు హల్ చల్ చేశారు. ఆయన రూపొందించిన వ్యూహం సినిమాలో తమ అభిమాన నేతలను అభ్యంతరకంగా చూపించారంటూ టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యూహం సినిమా పోస్టర్లను, ఆర్జీవీ దిష్టి బొమ్మను తగులబెట్టి హంగామా సృష్టించారు. వ్యూహం సినిమాను బ్యాన్ చేయాలంటూ నినాదాలు చేశారు.

రామ్ గోపాల్ వర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హడావుడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆర్జీవీ కార్యాలయం వద్దకు చేరుకుని టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఆధారంగా ఆర్జీవీ వ్యూహం సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. వైఎస్సార్ మరణానంతరం జగన్ పొలిటికల్ కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకుంది? వంటి అంశాలతో ఈ సినిమాను రూపొందించడం జరిగింది.

ఆర్జీవీ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తల హల్‌చల్.. దిష్టి బొమ్మ తగులబెట్టి హంగామా

ఈ సినిమాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌లను అభ్యంతరకరంగా చిత్రీకరించారని ఆ పార్టీల శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 29న థియేటర్లలో విడుదల కానుంది.  ‘‘నా ఆఫీసు ముందు మీ కుక్కలు మొరుగుతున్నవి.. ఒక్కసారిగా పోలీసులు రాగానే పారిపోయాయి’’ అంటూ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌ను ఆర్జీవీ ట్యాగ్ చేశారు. టీడీపీ కార్యకర్తల వీరంగంపై నిర్మాత దాసరి కిరణ్‌ స్పందించారు. సినిమాను సెన్సార్‌ బోర్డు సర్టిఫై చేసిన తర్వాత దాడులు చేయడం భావ్యం కాదన్నారు. 

Google News