చనిపోయినా వదలని రాబందులు… గీతాంజలిపై అదే ట్రోలింగ్

గీతాంజలి మరణం ఒక విషాదం. ఆమె చనిపోవడానికి కారణం ట్రోలింగ్ వల్లే అనే విషయం క్లియర్ గా అర్థమవుతున్నా… ఈ విషయంలో టీడీపీ, జనసేనకి చెందిన వారు సోషల్ మీడియాలో ఇంకా దిగజారి ప్రవర్తిస్తున్నారనిపిస్తోంది.

ఆంధ్రపదేశ్ తెనాలికి చెందిన గీతాంజలి ట్రోలింగ్ కి తట్టుకోలేక తన ఇద్దరు ఆడపిల్లలను అనాథలుగా చేసి కన్నుమూసింది. ఆమె ఆత్మహత్యకు దారితీసేలా చేసిన ట్రోలర్స్ పై చర్య తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విచారం ముమ్మురం చేసింది.

Advertisement

మరోవైపు, ఆమె మరణం తర్వాత కూడా ఎల్లో గ్యాంగ్ నుంచి ట్రోలింగ్ ఆగలేదు. ఆమె మరణాన్ని రకరకాలుగా వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నాయి జనసేన, టీడీపీ.

ఫేక్ వీడియోలు తయారుచేసి వదులుతున్నారు. ఆ వీడియోలకు వాయిస్ మిక్సింగ్ చేసి ఆమె క్యారెక్టర్ ని డ్యామేజ్ చేస్తున్నారు. రాజకీయ లబ్ది కోసం ఎంతకైనా దిగజారే వారి ఆగడాలు చూస్తుంటే శవాలను పీక్కుతిని బతికే రాబందులు గుర్తొస్తున్నాయి.

తమ మీడియాను, సోషల్ మీడియాను ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ చనిపోయిన ఒక అమాయక యువతి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోంది.

ఆ పార్టీ ఇలాంటి దుర్మార్గాలకు ఒడిగట్టడం ఇదే మొదటి సారి కాదని, ఎన్టీఆర్ – వైస్రాయ్ హోటల్ ఉదంతం నుంచి ఇలాగే అబద్దాలను నిజాలుగా ప్రచారం చేసే పని చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఆయన బద్నామ్ అయ్యేలా చేశారు. ఇప్పుడు గీతాంజలి ఉదంతంతో ఆ పార్టీ నీచపు వైఖరి మరోసారి బయటపడింది.