మినీ మేనిఫెస్టోలతో విమర్శలపాలవుతున్న టీడీపీ, జనసేన

మినీ మేనిఫెస్టోలతో విమర్శలపాలవుతున్న టీడీపీ, జనసేన

పార్టీలకు ఎన్నికల్లో మేనిఫెస్టో అనేది అత్యంత కీలకంగా మారుతుంది. ఇది కూడా ఓటర్ల మైండ్ సెట్‌ను మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. టీడీపీ, జనసేనలు తాజాగా మినీ మేనిఫెస్టో అంటూ ఒకదానిని సిద్ధం చేసి తాము ఏదో చేస్తున్నామని కలరింగ్ ఇస్తున్నాయి. ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తామని కొద్ది రోజుల క్రితమే రెండు పార్టీలు ప్రకటించాయి. దసరా నాటికి ప్రకటిస్తామని టీడీపీ చెప్పింది. ఇక జనసేనతో పొత్తు తర్వాత అక్టోబర్ ఎండింగ్‌కి అన్నాయి. 

ఇప్పటికే టీడీపీ మహానాడు సందర్భంగా ఒక మినీ మేనిఫెస్టోను ప్రకటించింది. ఇక ప్రస్తుతం ఐదు అంశాలను తీసుకుని టీడీపీ తరుఫున మరో ఆరు అంశాలను కలిపి.. మొత్తంగా 11 అంశాలతో మరో మేనిఫెస్టోను ఇరు పార్టీలు విడుదల చేశాయి. అంటే ఇప్పటికే టీడీపీ కూటమి తరుఫున రెండు మినీ మేనిఫెస్టోలు విడుదల అయ్యాయి. ఇక అసలు సిసలైన మేనిఫెస్టో మరొకటి ఉంటుందట. ఎన్ని మేనిఫెస్టోలురా బాబోయ్ అనిపిస్తోందా? తప్పదు మరి.. భరించాలి. ఎన్నైనా ఉంటాయ్.

మొత్తానికి రెండు పార్టీలు కలిసి మేనిఫెస్టోను కామెడీ చేసేస్తున్నాయి. ఇక ఈ మినీ మేనిఫెస్టోలో జగన్ హయాంలో రద్దైన సంక్షేమ పథకాలపై పున:పరిశీలన ఉంటుందట. ఇప్పటి వరకూ తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను జగన్ సర్కారు రద్దు చేసిందని టీడీపీ ఇప్పటి వరకూ చెబుతూ వచ్చింది. అవేంటో నేరుగా చెప్పి.. వాటిని ప్రవేశ పెడతామంటే లెక్క వేరేలా ఉంటుంది. కానీ అలా చెప్పకుండా పరోక్షంగా చెప్పడంతో టీడీపీకి అసలు ధైర్యం లేదన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మొత్తానికి పూర్తి స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేయకుండా మినీ మేనిఫెస్టోలతో టీడీపీ-జనసేనల ద్వయం విమర్శలపాలవుతోంది.

Google News