దిక్కుతోచని స్థితిలో టీడీపీ.. ఫ్రస్ట్రేషన్ తో బూతులు..!

నడి సంద్రంలో టీడీపీ.. దిక్కుతోచని స్థితిలో క్యాడర్

ప్రయాణం కష్టంగా మారినప్పుడు.. దారి తెలియనిప్పుడు నిరుత్సాహం.. నిస్తేజం ఆవహిస్తుంది. ఎవరిని నిందించాలో.. ఎక్కడ ముగింపు పలకాలో తెలియదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతల పరిస్థితి ఇలాగే ఉంది. ఏం చేయాలో పాలు పోక నాయకులు సోయతప్పి మాట్లాడుతున్నారు.

Minister Roja

దాదాపు నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన విశాఖ టీడీపీ నాయకుడు బండారు సత్యనరాయణమూర్తి.. మంత్రి రోజా మీద చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టీడీపీ నాయకుల మానసిక స్థితిని ప్రతిబింబిస్తున్నాయి. మహిళా మంత్రిని ఉద్దేశించి రాయడానికి వీల్లేని భాషలో దూషిస్తూ ఘన కార్యం చేసినట్లు విర్రవీగడం చూస్తుంటే పార్టీ ఏ వైపు పయనిస్తోందో కూడా అర్థం కావడం లేదు. నాయకుల వ్యవహారశైలి ఇలా మారిందేంటన్న సందేహాలు కలుగుతున్నాయి.

మార్కులు కొట్టేయడానికి తెగ ట్రై చేస్తున్నారు..

టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో ఉన్నారు. యువనేత లోకేష్ వచ్చేసి పరారీలో ఉన్నారు. ఇక పార్టీ అధ్యక్షుడు ఏమయ్యారో కూడా తెలియదు. సీనియర్లంతా దాదాపు సైలెంట్ అయిపోయారు. క్యాడర్ అంతా గప్ చుప్. పార్టీకి దిశా నిర్దేశం చేసే దిక్కూ దివాణమే లేకుండా పోయింది. ఈ తరుణంలో చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి వంటివారి దృష్టిలో పడేందుకు, సాధ్యమైనన్ని ఎక్కువ మార్కులు కొట్టేయడానికి బండారు వంటివారు తెగ ట్రై చేస్తున్నారు. తమ స్థాయి మరిచి సోయి తప్పి మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతోంది.

నడి సంద్రంలో టీడీపీ.. దిక్కుతోచని స్థితిలో క్యాడర్

బాలకృష్ణ వంటి సంస్కారవంతుడైన నాయకుడిని రోజా విమర్శిస్తూ మాట్లాడతారా? అంటూ బండారు వెనుకేసుకుంటూ వచ్చారు. నిజానికి ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనకు బాలయ్యలోని అజ్ఞానం కనిపించలేదు అనిపిస్తోంది.

మహిళలకు వీళ్లేం గౌరవం ఇస్తారు?

ఆడపిల్ల కనిపిస్తే ముద్దయినా పెట్టాలి.. కడుపైనా చేయాలి అని బహిరంగంగా మాట్లాడిన బాలయ్యను సంస్కారానికి ప్రతిరూపం అని చెప్పడం ద్వారా బండారు తన గులాంగిరీ స్థాయిని బయటపెట్టకున్నారు. ఇలాగైనా ఎలాగైనా చంద్రబాబు కుటుంబం ఆశీస్సులు పొందాలన్న ఆతృత బండారులో స్పష్టంగా కనిపిస్తోంది.

Ayyanna Patrudu TDP

మరో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఇష్టానుసారం మాట్లాడుతూ తమ వంతు సహకారం పార్టీకి అందిస్తున్నారు. పదవిలో ఉన్న ఒక మహిళా మంత్రి మీదనే ఇలా రౌడీ భాషలో దాడులు చేస్తుంటే మామూలు మహిళలకు వీళ్ళు ఎలాంటి గౌరవం ఇస్తారు ? అంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆలోచనలు రేకెత్తిస్తోంది.

Google News