నారా లోకేష్‌కు సీఐడీ ఇచ్చిన నోటీసులో కీలక అంశాలేంటంటే?

నారా లోకేష్‌కు సీఐడీ ఇచ్చిన నోటీసులో కీలక అంశాలేంటంటే..

ఏపీ పొలిటిక్స్ మాంచి కాకమీదున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్ట్‌కు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమచారం. అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు స్కాం కేసులో లోకేష్‌ను ఏ-14‌గా పేర్కొన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే నిన్న ఆయనకు ఢిల్లీలో విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. 4వ తేదీన ఉదయం 10 గంటలకు విచారణకు రావాలంటూ నోటీసుల్లో సీఐడీ అధికారులు పేర్కొన్నారు.

ఈ నోటీసుల్లో అధికారులు విచారణ సమయంలో నారా లోకేష్ అనుసరించాల్సిన విధివిధాలను వివరించారు. ఏ ఏ అంశాల్లో తమకు సమాచారం అందించాలనే కీలక విషయాలను నోటీసులో అధికారులు పేర్కొన్నారు.

ఈ కేసు సంబంధించిన ఎవిడెన్స్‌ను ఏవిధంగానూ ట్యాంపరింగ్ చేయకూడదు. అలాగే కేసుతో సంబంధం ఉన్న వారిని ప్రలోభపెట్టడమో.. బెదిరింపులకు గురి చేయడమో చేయకూడదు. అవసరమైతే కోర్టు ఎదుట హాజరు కావాలి. ఎప్పుడంటే అప్పుడు విచారణకు హాజరై అధికారులకు సహకరించాలి. పూర్తి పారదర్శకంగా నిజాలను వెల్లడించాలి.

నారా లోకేష్‌కు సీఐడీ ఇచ్చిన నోటీసులో కీలక అంశాలేంటంటే..

విచారణ సమయంలో హెరిటేజ్ ఫుడ్స్‌ సంస్థకు సంబంధించిన లావాదేవీలను, భూముల లావాదేవీల విషయంలో బోర్డు మీటింగ్స్‌కు సంబంధించిన మినిట్స్ బుక్‌ను, భూముల కొనుగోళ్లకు సంబంధించిన పేమెంట్స్ వివరాలను.. సమర్పించాలి.

విచారణ కొనసాగినన్ని రోజుల్లో ఈ కేసుకు సంబంధించిన ఏ ఆధారాన్ని అయినా ధ్వంసం చేయటానికి వీల్లేదు. విచారణలో భాగంగా.. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇంకేమైన కండీషన్స్ పెట్టినట్టయితే.. వాటిని కూడా అనుసరించాల్సి ఉంటుంది. అలాగే సుతో సంబంధం ఉన్న దోషులను అరెస్ట్ చేసేందుకు పూర్తిగా సహకరించాలి’’ అని నోటీసులో సీఐడీ అధికారులు పేర్కొన్నారు.