జగన్ హామీలు చూసి టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్..

జగన్ హామీలు చూసి టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్..

మిచౌంగ్ తుపాను ఏపీని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ తుపాను విషయమై జగన్ వ్యవహరించిన తీరు సర్వత్రా ప్రశంసనీయంగా మారింది. అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక్కడ తుపానులు వచ్చి ఊర్లకు ఊర్లు కొట్టుకుపోతున్నా పట్టించుకోలేదు. ప్రగతి భవన్‌ను వీడింది లేదు.. జనాన్ని పరామర్శించిందీ లేదు. అవసరమైతే కేసీఆర్ జనాలను ప్రగతి భవన్‌కు రప్పించుకునేవారు కానీ ఆయన మాత్రం జనం దగ్గరికి వెళ్లేవారు కాదు.

ఇప్పుడు జగన్‌ను కేసీఆర్‌తో పోల్చి ప్రశంసలు కురిపిస్తున్నారు. జగన్ బాధితులను తాడేపల్లి ప్యాలెస్‌కు పిలిపించుకోకుండా స్వయంగా జనాల దగ్గరకు వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జనాల్లోకి ముందుగా వెళ్లినా కూడా.. ప్రోటో కాల్ సమస్యల కారణంగానే జగన్ కాస్త ఒక అడుగు ఆలస్యంగా వేశారు. అయినా సరే.. సీఎమ్మె స్వయంగా వెళ్లి వాళ్లందరినీ పరామర్శించి వారికి అవసరమైన సాయం చేస్తామని చెప్పడంతో జనం హ్యాపీ.

Advertisement

రైతులను ఆదుకుంటామని జగన్ బాధిత రైతులను ఆదుకుంటామని జగన్ హామీ ఇవ్వడంతో పాటు.. రైతులకు సబ్సిడీతో విత్తనాలు అందిస్తామని తెలిపారు. తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రతి ఇంటికి 2500 రూపాయలు ఇస్తామని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ప్రతీ ఇంటికి వలంటీర్ స్వయంగా వచ్చి డబ్బులు అందజేస్తారని జగన్ తెలిపారు. అలాగే తుపాను కారణంగా దెబ్బతిన్న  రోడ్లను వెంటనే మరమ్మతు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. జగన్ రియాక్షన్ చూసి టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి.