గురు, శిష్యుల మధ్య పోటీ.. ఏపీలో హాట్ టాపిక్ అవుతున్న స్థానం ఇదే..

గురు, శిష్యుల మధ్య పోటీ.. ఏపీలో హాట్ టాపిక్ అవుతున్న స్థానం ఇదే..

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎక్కడుంటే విజయం అక్కడే ఉంటుందంటారు. ఈ క్రమంలోనే ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు తొలుత చీపురుపల్లి టికెట్ ఇస్తామని చెప్పారట. కానీ గంటా మాత్రం ససేమిరా అనేశారట. దీనికి కారణం మంత్రి బొత్స సత్యనారాయణ ఇలాఖా కావడమే. అక్కడ బొత్సదే హవా. ఆయనను ఎదుర్కొని నిలవడం చాలా కష్టం అందుకే.. అయితే భీమిలి లేదంటే లేదని గంటా సైలెంట్ అయ్యారు.

గంటా ఈ మధ్య కాలంలో చాలా హాట్ టాపిక్ అవుతున్నారు. అయితే తాజాగా గంటాకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. ఆయనకు భీమిలి టికెట్‌ను చంద్రబాబు ఇస్తున్నారట. దీనికి కారణం ఆయన సామాజిక వర్గమేనని టాక్. పైగా భీమిలిలో అవంతి శ్రీనివాస్‌ను ఎదుర్కోవాలంటే గంటాకే సాధ్యమని చంద్రబాబు భావించారట. సర్వేలోనూ ఇదే తేలిందట. దీంతో భీమిలి టికెట్‌ను గంటాకు ఇస్తేనే బాగుంటుందని చంద్రబాబు భావిస్తున్నారట.

ఈ క్రమంలోనే గంటాకు చంద్రబాబు సంకేతాలు కూడా ఇచ్చేశారట. దీంతో రెట్టించిన ఉత్సాహంతో గంటా పనులు మొదలు పెట్టారట. భీమిలిలో గంటా పోటీ అంటే ఒకరకంగా గురు శిష్యుల మధ్య పోటీయే. అవంతి నిజానికి గంటా శిష్యుడే కావడం గమనార్హం. ఆయనే అవంతిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అలాంటి గురు, శిష్యుల మధ్య పోటీ చూడాలని ఎవరికి ఉండదు. వచ్చిన వార్త నిజమే అయితే మాత్రం ఏపీలో హాట్ టాపిక్ అవుతున్న స్థానాల్లో భీమిలి కూడా ఒకటి కావడం ఖాయం. 

Google News