రఘురామకు బీజేపీ టికెట్ ఎందుకు ఇవ్వలేదంటే..

రఘురామకు బీజేపీ టికెట్ ఎందుకు ఇవ్వలేదంటే..

ఏపీలో కొన్ని స్థానాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. వాటిలో ఒకటి నరసాపురం.  టీడీపీ – జనసేన – బీజేపీ కూటమిలోని ఏ పార్టీకి నరసాపురం వెళుతుందో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రకటించారు. బీజేపీకి ఈ స్థానం వెళ్లింది. అనూహ్యంగా ఆ పార్టీ రఘురామను పక్కనబెట్టి నరసాపురం లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాసవర్మను ఎంపిక చేసింది. నిజంగా ఇది రఘురామకు షాకే. ఈ స్థానం నుంచి పోటీకి వర్మ, పాకా సత్యనారాయణ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు.

అయితే చివరకు అదృష్టం మాత్రం శ్రీనివాసవర్మను వరించింది. శ్రీనివాసవర్మ కార్యకర్త నుంచి బీజేపీలో తన ప్రస్థానం ప్రారంభించి.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆపై పార్టీ రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగారు. ఇప్పుడు ఏకంగా ఎంపీ సీటు దక్కించుకున్నారు. అయితే తనకు ఏ పార్టీకి నరసాపురం సీటు దక్కినా టికెట్ ఫిక్స్ అని నమ్మిన రఘురామకు గట్టి షాకే తగిలింది. నరసాపురం ఎంపీ సీటుపై గంపెడాశలు పెట్టుకున్న రఘురామకు నిరాశే ఎదురైంది. ఆయన పోటీపై కొందరైతే ఏకంగా పందేలు కూడా కాసుకున్నారు.

Advertisement

మరోవైపు ఢిల్లీ బీజేపీ పెద్దల సపోర్ట్ కూడా రఘురామ వైపేనని అంతా భావించారు. కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది. అయితే నరసాపురం టికెట్ రఘురామకు రాకుండా అడ్డుకున్నదెవరనేది ఆసక్తికరంగా మారింది. అయితే రఘురామ ఎంపీగా గెలిచిన అనంతరం డిల్లీకే పరిమితమయ్యారని.. నరసాపురం వైపు తిరిగి కూడా చూడలేదనేది వాస్తవం. దీంతో ఆయనకు నరసాపురంలో హవా తగ్గిపోయింది. ఒకవేళ రఘురామకు బీజేపీ టికెట్ ఇచ్చినా కూడా గెలవడం అసాధ్యమని భావించి ఆయనకు బీజేపీ టికెట్ ఇవ్వలేదని టాక్.