మరో జన్మ ఉంటే.. మళ్ళీ పుట్టు రాజన్న..!

మరో జన్మ ఉంటే.. మళ్ళీ పుట్టు రాజన్న..!

ఎటు చూసినా.. ఎవరి నోట విన్నా వైఎస్!

పేదల పెన్నిధి, 108, 104, ఆరోగ్యశ్రీ సృష్టికర్త.. రైతు బాంధావుడు, సంక్షేమ పథకాల పెన్నిధి.. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత.. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను అభిమానులు, కార్యకర్తలు ఊరూ.. వాడా నిర్వహించారు..! ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఇక ఇల్లు, పల్లె, గ్రామ, పట్టణం.. తెలుగు రాష్ట్రాలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు పార్టీ, కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా జయంతి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ఎవరికి తోచిన రీతిలో వారు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు.

మళ్ళీ పుడితే బాగుండు!

తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మకుటం లేని మహారాజు.. మాట తప్పని, మడమ తిప్పని యోధుడి విగ్రహాలు, చిత్రపటాలకు నివాళులు అర్పించి తెలుగు ప్రజానీకం ఎమోషనల్ అయ్యింది.! ఎక్కడ చూసినా జోహార్ వైయస్ఆర్.. అనే నినాదాలు మార్మోగాయి.! తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వైఎస్ మళ్ళీ పుడితే బాగుండు అని ఎంతో ఆశపడుతున్నారు..! పరిపాలనలో మానవత్వాన్ని జోడించి నవయుగానికి నాంది పలికిన వైతాళికుడుకి సమానంగా పాలన చేసే దమ్ము ఉన్న నేత ఎవరు..? అని ఎన్నెన్నో ఊహించుకుంటున్నారు తెలుగు ప్రజలు..!

ఎవరి నోట విన్నా..!

రాజన్న చనిపోయారంటే నాటికి నేటికీ నమ్మశక్యంగా లేదని.. కార్యకర్త మొదలుకుని అభిమానులు, నేతలు.. తెలుగు ప్రజలు చెప్పుకుంటున్నారు. ఆయనే బతికి ఉంటే ఇప్పుడు ఏపీలో పరిస్థితులు వేరేలా ఉండేవని.. అసలు రాష్ట్ర విభజన అనేది ఉండేదే కాదని గట్టిగానే కార్యకర్తలు చెబుతున్న మాటలు. ఎవరైతే ఇప్పుడు వైఎస్ గురుంచి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారో.. వారికి నాడు అసెంబ్లీ వేదికగా పెద్దాయన మాట్లాడిన మాటలను గుర్తు చేస్తున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఎవరి నోట విన్నా వైఎస్.. వైఎస్ ఇదే మాట. మీడియా, సోషల్ మీడియా వేదికగా వైఎస్ రాజశేఖరరెడ్డితో వారికి ఉన్న అనుబంధం.. తీపి గుర్తులు గుర్తుకు తెచ్చుకొని పంచుకుంటున్నారు.

Ysr Anniversary 2

చెరిగిపోని పేరు..!

సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే జయంతి, వర్థంతి అని గుర్తు చేసుకునే సాధారణ మనిషివి కాదులే పెద్దాయన.. నువ్వో శిఖరం అంతే.. భూమి అంతరిస్తే తప్ప ఆ శిఖరం మాయమవ్వదు.. జనం అంతా గతిస్తే తప్ప నీ పేరు చెరిగిపోదు.. అని అభిమానులు, కార్యకర్తలు, నేతలు చెప్పుకుంటూ కంటతడి పెడుతున్న పరిస్థితి. పేదల ముఖాల్లో చిరునవ్వు కోసం చివరి శ్వాస వరకు పనిచేసిన మీలాంటి వాళ్ళు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు అవసరం ఉందని చెబుతూ మళ్ళీ పుట్టు రాజన్నా అని రిక్వెస్ట్ చేస్తున్నారు.

ఓకే ఒక్కడు!

రాజన్నా.. తెలుగు సినిమాల్లో ఒక కథానాయకుడు డజన్ల కొద్ది రౌడీలతో ఉత్తుత్తే ఫైట్ చేస్తే నెత్తికెక్కించుకునేవారు.. వారే అభిమానులు, సినీ ప్రియులు. మరి మీరు రాజకీయ రణరంగంలో ఒకే ఒక్కడై ధీరత్వంతో రియల్ ఫైట్ చేస్తే హీరోలు జీరోలయ్యేరు..అపర చాణక్యుల వ్యూహాలు సైతం మీ ముందు బెడిసి కొట్టాయని కానీ మీరు మాత్రం ఓకే ఒక్కడు రియల్ హీరో వైఎస్ఆర్..! నువ్వు అర్ద దశాబ్దమే పరిపాలించావని అర్దాంతంగా పోయావని కొందరు భ్రమ పడుతున్నారు.. నువ్వు ఒక శతాబ్ద కాల అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించి అంబరానికి ఎగిసి పోయావు..అక్కడి దేవతల అమరుల స్థాయికి ఎదిగిపోయావు! అని అభిమానులు, కార్యకర్తలు చెప్పుకుంటున్నారు రాజన్న..!

Google News