సిద్ధమవుతున్న వైసీపీ ఐదో లిస్ట్.. నలుగురు ఎంపీలకు చెక్..?

సర్వే ఏదైనా చెప్పేదొక్కటే.. ఈసారి కూడా వైసీపీదే విజయం..!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం వడపోత కార్యక్రమం ఇంకా జరుగుతూనే ఉంది. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గెలుపు గుర్రాలకే టికెట్లు అనే మాటకు స్టిక్ అయి ఉన్నారు. ఈ క్రమంలోనే సర్వేలు నిర్వహించి నిర్మోహమాటంగా జనాదరణ లేని నేతలను పక్కనబెట్టేస్తున్నారు. ఇప్పటికే వైసీపీకి సంబంధించిన నియోజకవర్గాల ఇన్‌చార్జుల కూర్పు చాలా వరకూ పూర్తైంది. ఈ క్రమంలోనే నాలుగు జాబితాలను వైసీపీ విడుదల చేసింది.

ప్రస్తుతం వైసీపీ ఐదో జాబితా విడుదలపై ఫోకస్ పెట్టింది. తొలి నాలుగు జాబితాల్లో మొత్తంగా 58 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో వైసీపీ అధిష్టానం మార్పులు చేర్పులు చేసింది. ఇంకా కొన్ని జిల్లాలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. అయితే నాలుగో లిస్టే చివరిదని అంతా భావించారు. అయితే నాలుగో జాబితాలో కేవలం 9 మంది పేర్లు మాత్రమే ప్రకటించారు. సంక్రాంతి కారణంగా నాలుగో లిస్ట్ కాస్త ఆలస్యమైంది.

అయితే ఐదో లిస్ట్ ప్రిపేర్ చేయడంలో భాగంగా అభ్యర్థులతో మంతనాలు జరుగుతున్నాయి. ఈ లిస్ట్‌లో భాగంగా  మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో జగన్ మాట్లాడినట్టు తెలుస్తోంది. మంత్రి గుడివాడ అమర్నాథ్, నంద్యాల, నరసరావుపేట, గుంటూరు ఎంపీలు, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డితో పాటు కొందరు ఎమ్మెల్యేలతో జగన్ మాట్లాడినట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద నలుగురైదురుగు ఎంపీ అభ్యర్థులను మారుస్తారని టాక్. 

Google News