జగనన్న పాలనకు ప్రతిరూపం.. వైరల్ గా మారిన చిత్రం

జగనన్న పాలనకు ప్రతిరూపం.. వైరల్ గా మారిన చిత్రం

కొన్ని చిత్రాలను మనసుతో చూడాలి. ప్రతి చిత్రానికీ ఓ భావం ఉంటుంది. దానిని మనసుతో చూస్తేనే అర్థమవుతుంది. ఎన్నో మాటలు చెప్పలేని విషయాలను కేవలం ఒక చిత్రంతో చెప్పేయవచ్చు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అలాంటి చిత్రమే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జగనన్న పాలనకు ప్రతిరూపం.. వైరల్ గా మారిన చిత్రం

రేపు (డిసెంబర్ 21) జగన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఓ అపురూపమైన చిత్రాన్ని సోషల్ మీడియాలో విడుదల చేశారు. దీనిని చూడగానే థీమ్ ఏంటనేది అర్థమై పోతుంది. జగన్ నాలుగున్నరేళ్ల పాలనలో పేద, బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలవడమే కాకుండా వారిని సొంతవారిలా అక్కున చేర్చుకున్న తీరును వివరిస్తుంది. ఇలా ఒక్కటి కాదు.. ఎన్నో విషయాలు ఈ చిత్రంలో నిక్షిప్తమయ్యాయి.

జగనన్న పాలనకు ప్రతిరూపం.. వైరల్ గా మారిన చిత్రం

ఓవైపు పచ్చని పంట పొలాలు, ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారైన ప్రభుత్వ పాఠశాల, గ్రామ సచివాలయం, వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలను ఈ చిత్రంలో చేర్చారు. ఇంకా ఈ చిత్రంలో విపక్షాలకు కౌంటర్ కూడా ఇచ్చారు. జగన్ పాలనలో చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవారి వరకూ అన్ని వర్గాలు సంతోషంగా ఉంటే.. ఇది చూసి ఓర్వలేని ఎల్లో బ్యాచ్ గోతి కాడ నక్కల్లా చూస్తున్నట్టుగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

జగనన్న పాలనకు ప్రతిరూపం.. వైరల్ గా మారిన చిత్రం

ఇక ఇది జగన్ అభిమానులను, వైసీపీ శ్రేణులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా రూపొందించిన ఈ చిత్రంతో కూడిన ఫ్లెక్సీలు ప్రతి ఒక్క మనసునూ కట్టిపడేస్తున్నాయి. దీనిని ప్రతి ఒక్క వైసీపీ అభిమాని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

జగనన్న పాలనకు ప్రతిరూపం.. వైరల్ గా మారిన చిత్రం

వైసీపీ అభిమానుల ఫోన్‌ల స్క్రీన్ లలో, వాట్సప్ స్టేటస్‌లలో.. సోషల్ మీడియా హ్యాండిల్స్ సేవ్ చేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో తమ అభిమాన నేత చేసిన గొప్ప పనులను ఈ చిత్రం ద్వారా జనాలకు జగన్ ఫ్యాన్స్ వివరిస్తున్నారు. ఈ ఫ్లెక్సీలు పెట్టిన గంటల వ్యవధిలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

జగనన్న పాలనకు ప్రతిరూపం.. వైరల్ గా మారిన చిత్రం

ఊరూరా వెలిసిన ఈ ఫ్లెక్సీలను ప్రతి ఒక్కరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చేందుకు అభిమానులు ఆరాట పడుతున్నారు. ఈ చిత్రానికి స్పందన కూడా అదే రేంజ్‌లో ఉంది. రేపటికి ఈ చిత్రం ట్రెండింగ్‌లో టాప్ 1లో ఉంటుందనడంలో సందేహమే లేదు.

Google News