హమీ నేరవేర్చి ఉద్దాన వాసుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం జగన్

హమీ నేరవేర్చి ఉద్దాన వాసుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం జగన్

రూ. 742 కోట్లతో కిడ్నీ బాధితుల కోసం వైయస్ఆర్ సుజలధార

రూ. 50 కోట్లతో 200 పడకల సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి

ఎన్నో ఏళ్లుగా అక్కడ ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప వారికి ఒరిగిందేమి లేదు. ఉద్దానం వాసులను దశాబ్దాలుగా వేధిస్తున్న కిడ్నీల సమస్య తో ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి మహాప్రభో అన్నా పట్టించుకున్న నాధుడే లేదు. కేవలం రాజకీయ లబ్ది కోసమే తప్ప గత ప్రభుత్వాలు చేసింది లేదు. తూతూ మంత్రంగా ముసలికన్నీరు కార్చడం, కంటి తుడుపు చర్యలు తప్ప ఉద్దానం పీడిత ప్రజలకు చేసేందేమి లేదు.

అక్కడి ప్రజలు పడుతున్న బాధలను పాదయాత్ర సమయంలో వై ఎస్ జగన్ స్వయంగా చూశారు. ఆస్పత్రుల్లో పడి ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్న వారి బాధలను వినడమే కాక నేరుగా చూసి చలించిపోయారు. ఖచ్చితంగా తాను అధికారంలోకి వస్తే మీ బాధలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని హమీ ఇచ్చారు.

హమీ నేరవేర్చి ఉద్దాన వాసుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం జగన్

నీరు కోసం 700 కోట్ల రూపాయలతో శాశ్వత పరిష్కారం

ఇచ్చిన హమీ మేరకు పలాసలో ఉద్దానం పీడిత జనం కోసం 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సుమారు 50 కోట్లకు పైగా ఖర్చుచేసి ఆస్పత్రి నిర్మించింది వైస్సార్సీపీ ప్రభుత్వం. దీనికి “డాక్టర్‌ వైఎస్సార్‌ కిడ్నీ రీసెర్చ్‌ హాస్పిటల్‌”గా ప్రభుత్వం నామకరణం చేసింది. కిడ్ని వ్యాధికి గల మూల కారణాల పై పరిశోధన చేసి నివేదిక సిద్దం చేసింది. రోగం వచ్చాక ట్రీట్ మెంట్ చేయడం కాకుండా రోగం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రణాళిక సిద్దం చేశారు. కార్పోరేట్ స్థాయి వైద్యం ఇక నుండి ప్రతి ఒక్క పేదవాడికి అందేలా చర్యలు తీసుకుంటున్నారు. కిడ్ని రోగంతో ఏ ఒక్కరూ బాధపడకూడదనే తలంపుతో జగన్ ఇచ్చిన హమీ మేరకు ఆస్పత్రి నిర్మాణం చేయడమే కాకుండా, సుమారు 700 కోట్ల రూపాయలతో నీరు అందించేందుకు శాశ్వత పరిష్కారం చేశారు సీఎం జగన్.

హమీ నేరవేర్చి ఉద్దాన వాసుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం జగన్
Uddanam Project

జిల్లా వాసుల ఆనందం

సుమారు 700 కోట్ల రూపాయల వ్యయంతో ఉద్దాన ప్రాంత ప్రజలకు వంశధార నీరు అందించేందుకు సుజలధార ప్రాజెక్టును వైస్సార్ ప్రభుత్వం నిర్మించింది. పలాస, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం మండలాల్లోని ప్రజలకు వంశధార నది నుంచి స్వచ్ఛమైన తాగునీటిని అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రాజెక్టును చేపట్టింది. ఒక్కొక్కరికి రోజుకు వంద లీటర్లు చొప్పున నీటిని సరఫరా చేయాలన్నదే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ నెల 14న సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. ఈ రెండు ప్రాజెక్టులను సీఎం జగన్ చేతుల మీదుగా ఈ నెల 14 వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఉద్దానం కిడ్ని రోగులకు శాశ్వత పరిష్కార దిశగా అడుగులు వేస్తున్న జగన్ ని శ్రీకాకుళం జిల్లా వాసులు గుండెల్లో పెట్టుకున్నారు. ఈన్నాళ్ల కు తమ సమస్య పరిష్కారం కాబోతుందని జిల్లా వాసులు ఆనందపడుతున్నారు. బతుకుపై ఆశను కలిగించిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటామని ఉద్దానం ప్రజలు అంటున్నారు.

హమీ నేరవేర్చి ఉద్దాన వాసుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం జగన్

గత ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్ళినా ఫలితం లేకుండా పోయింది. కంటితుడుపు చర్యలుగా మాత్రమే చేసి పబ్లిసిటీ చేసుకున్నారు తప్ప తమ సమస్యలను పరిష్కరించలేదని ప్రజలు వాపోయారు. అలాంటి తరుణంలో సీఎం వైయస్ జగన్ పాదయాత్రలో ఆ ప్రాంతాన్ని సందర్శించి వారి బాధలని అర్థం చేసుకుని అధికారంలోకి వచ్చాక ఆ మహమ్మారిని రూపుమాపుతానని ఏదైతే హమీ ఇచ్చారో అది నేరవేరడంతో ఉద్దానవాసుల జీవితాలు వెలుగులు నిండబోతున్నాయి.

Google News