ఉద్యోగార్ధులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు… గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల

ఉద్యోగార్ధులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు... గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల

ఏపీలో ఉద్యోగ జాతర మొదలైంది. ఏపీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళుతున్న జగన్ నిరుద్యోగుల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నారు. నిజానికి జగన్ ప్రభుత్వ హయాంలో గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వలేనన్ని ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 6 లక్షల 16 వేల 323 పోస్టులను నియమించింది. ఒక్క రోజు వ్యవధిలోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలవ్వడం ఏపీ చరిత్రలోనే సువర్ణాధ్యాయంగా పరిగణించవచ్చు. గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా.. 81 పోస్టులను జగన్ ప్రభుత్వం భర్తీ చేయనుంది. దీనిలో భాగంగా 9 డిప్యూటీ కలెక్టర్లు, 26 డీఎస్పీ పోస్టులో భర్తీ కానున్నాయి. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పింది. ఆ తరువాత సుప్రీంకోర్టు తీర్పును బూచిగా చూపించి రెగ్యులరైజ్ చేయకుండా మోసం చేసింది.

బడి ఈడు పిల్లలందరినీ స్కూలుకు రప్పించడమే ధ్యేయంగా..

Advertisement

జగన్ అధికారంలోకి వచ్చాక నిబంధనలు సడలించి సాధ్యమైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో జగన్ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. ఇంటికో ఉద్యోగం కల్పించారు. తద్వారాపేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక పరిపుష్టి కల్పించినట్టైంది. మరోవైపు విద్యావ్యవస్థను సైతం ఉన్నతంగా జగన్ తీర్చిదిద్దారు. విద్యావ్యవస్థ బాగుంటేనే సమాజం తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే సదుద్దేశంతో ఇంగ్లీష్ మీడియంను కూడా ప్రవేశపెట్టారు. గతంలో ఏ ప్రభుత్వం ఖర్చు చేయనన్ని నిధులు విద్యావ్యవస్థకు ఖర్చు చేయడం జరిగింది. బడి ఈడు పిల్లలందరినీ స్కూలుకు రప్పించడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని దానికోసం అన్ని బడుల్లో నాడు నేడులో భాగంగా చాలా మౌలిక సదుపాయాలు కల్పించారు. ధనిక విద్యార్థుల మాదిరిగా ప్రతి పేద విద్యార్థి కూడా ఉన్నత విద్య చదువుకోవాలని అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటల్ విద్యబోధన చేసిన గొప్ప కార్యక్రమం జగన్ మాత్రమే చేపట్టారు.  జగన్ సర్కార్ చేసిన విద్యా సంస్కరణల సత్ఫలితాలు ఇపుడు ప్రతి పేద, మద్య తరగతి కుటుంబాల వారు చూస్తున్నారు.

ఉద్యోగార్ధులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు... గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల

10 వేల 143 ఖాళీ పోస్టులకు నియామక ప్రక్రియ..

మరోవైపు ప్రజారోగ్య శాఖలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా 50 నెలల్లో 53 వేల 126 పోస్టులను జగన్ ప్రభుత్వం భర్తీ చేసింది. ఆరు లక్షల ఉద్యోగాల్లో లక్షా 84 వేల 264 పోస్టులు రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయడం జరిగింది.3 లక్షల 99 వేల 791 పోస్టులు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమించారు. 19 వేల 701 పోస్టులు కాంటాక్ట్ బెసెస్‌లో నియామకాలు జరిగాయి. ఇవి కాక మరో 10 వేల 143 ఖాళీ పోస్టుల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. యూనివర్శిటీల్లో 3500 పోస్టులకు నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. టీడీపీ హయాంలో వైద్య ఆరోగ్య శాఖలో 1693 పోస్టులు మాత్రమే భర్తీ చేయడం జరిగింది. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విలేజ్ క్లినిక్‌లు మొదలకుని టీచింగ్ ఆస్పత్రుల్లో ఖాళీలన్నీ భర్తీ చేయడం జరిగింది.

టీడీపీ మాటల ప్రభుత్వం కాగా..

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి తొలి ప్రాధాన్యమిచ్చి.. కేవలం వైద్యరంగంలోనే దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా 53 వేల 126 పోస్టుల్నీ జగన్ ప్రభుత్వం భర్తీ చేసింది. 53 వేల పోస్టుల్లో.. 3899 మంది స్సెషలిస్ట్ డాక్టర్లు, 2088 మెడికల్ ఆఫీసర్లు, 13540 ఎఎన్ఎమ్‌లు గ్రేడ్ 3 పోస్టులతో కలిపి 19,527 పోస్టులు శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయడం జరిగింది. వీటితో పాటు 10032 మంది ఎంఎల్ హెచ్పీలు, 6734 స్టాఫ్ నర్స్ లు, 9751 మంది పారా మెడికల్ సిబ్బంది, 3303 క్లాస్-4 సిబ్బంది, 249 మంది డీఈవోలతో పాటు మెడికల్ కాలేజీల్లో నియమించిన 1582 ఉద్యోగులు, ఇతర సిబ్బందితో కలిపి మొత్తం  53,126 పోస్టులున్నాయి. నిజానికి ఇది ఏ రాష్ట్రం కూడా చేయలేదు. కేవలం నాలుగేళ్ల వ్యవధిలో ఇన్ని ఉద్యోగాల కల్పన అంటే అది ఒక్క జగన్ ప్రభుత్వానికే సాధ్యం. టీడీపీ హాయాంలో కేవలం వేలల్లో పోస్టులు భర్తీ చేసి చేతులు దులుపుకుంది. టీడీపీ మాటల ప్రభుత్వంగానే నిలిస్తే.. జగన్ ప్రభుత్వం చేతల ప్రభుత్వంగా జనం హృదయాల్లో నిలిచిపోయింది. ఇచ్చిన  హమీకి తగ్గకుండా జగన్ హయాంలో ఆరున్నర లక్షల ఉద్యోగాల నియామకాలు చేసి రాష్ట్రంలో నూతన శకానికి నాంది పలికారు. నాలుగన్నరేళ్ళ జగన్ పారదర్శక పాలనలో 2.14  లక్షల శాశ్వత ఉద్యోగాలను కల్పించి ఏపీ చరిత్రలోనే నూతన ఒరవడికి నాంది పలికారు.