YS Jagan: జగన్ టార్గెట్ ఆ ముగ్గురేనట..

YS Jagan: జగన్ టార్గెట్ ఆ ముగ్గురేనట..

ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ గెలుపే ధ్యేయంగా దూసుకెళుతున్నాయి. వైసీపీ అయితే గెలుపుతో పాటు టీడీపీకి చెందిన ముగ్గురు నేతల ఓటమే లక్ష్యంగా పని చేస్తోంది. ఆ ముగ్గురు ఎవరంటే టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఈ ముగ్గురినీ ఓడిస్తే చాలు టీడీపీ పతనం ఖాయమని సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ ముగ్గురినీ ఓడించే బాధ్యతలను ముగ్గురు తమ పార్టీ కీలక నేతలకు జగన్ అప్పగించారట. కుప్పం, మంగళగిరి, హిందూపురం నియోజకవర్గాల్లో ఆ ముగ్గురినీ ఓడించడమే లక్ష్యంగా వారు పని చేయాల్సి ఉంటుంది. కుప్పంతో పాటు హిందూపూర్ బాధ్యతలను సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ అప్పగించారని టాక్. కుప్పంలో చంద్రబాబును ఓడించి భరత్‌ను ఎమ్మెల్యేను చేస్తే మంత్రి వర్గంలో కీలక పోర్ట్‌ఫోలియో అప్పగిస్తానని పెద్దిరెడ్డికి జగన్ హామీ ఇచ్చారట.

ఇక పెద్దరెడ్డి తన నియోజకవర్గంలో కన్నా తనకు జగన్ అప్పగించిన బాధ్యతలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టి కుప్పం, హిందూపూర్‌లలోనే పూర్తి సమయాన్ని వెచ్చిస్తున్నారట. మంగళగిరి బాధ్యతలను ఎంపీ విజయసాయిరెడ్డికి అప్పగించారట. ఇక్కడ నారా లోకేష్‌ను ఓడించి గంజి చిరంజీవిని ఎమ్మెల్యేను చేయాలని తెలిపారట. గంజి చిరంజీవి బీసీ అభ్యర్థి కావడంతో బీసీలందరినీ ఏకం చేసే పనిలో విజయసాయిరెడ్డి ఉన్నారట. గ్రూపులు లేకుండా చూస్తూ అందరినీ ఒకతాటిపైకి తీసుకొస్తున్నారట. 

Google News