నాడు వైఎస్.. నేడు జగన్.. 2009 నాటి సీన్ రిపీట్..!

నాడు వైఎస్.. నేడు జగన్.. 2009 నాటి సీన్ రిపీట్..!

ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకూ ప్రత్యర్థులు పెరిగిపోతున్నారు. ఒక్కడిని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ఎంత మంది ప్రత్యర్థులు ఉంటే వ్యక్తి అంత బలవంతుడని అర్థం. సినిమాలో కూడా అంతే కదా. ఎంతమందిని ఎదుర్కొంటే హీరో అంత గొప్ప.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పుడు ఏపీలోనూ అదే జరుగుతోంది. ఇదంతా చూస్తుంటే ఎక్కడో ఎప్పుడో చూస్తున్నట్టుగా లేదు? ఒక్కసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి రోజులకు వెళ్లాల్సిందే. 2009లో ఒకవైపు కాంగ్రెస్ ఒక్కటే. వైఎస్సార్ అధినేతగా ఉండేవారు.. మరోవైపు ఆయనను ఓడించేందుకు పార్టీలన్నీ ఏకమయ్యాయి. టీడీపీ, టీఆర్ఎస్, వామపక్షాలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. మరోవైపు అప్పుడే ప్రజారాజ్యం పార్టీ కూడా పుట్టింది. చిరంజీవి ఏర్పాటు చేసిన ఆ పార్టీ మంచి దూకుడు మీదుంది. దాదాపు చిరంజీవి ఆంధ్రప్రదేశ్ సీఎం అయిపోనట్టేనని టాక్ కూడా నడిచింది.

నాడు వైఎస్.. నేడు జగన్.. 2009 నాటి సీన్ రిపీట్..!

నాటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే..

ఈ పార్టీలన్నింటినీ ఎదుర్కోవడమంటే మామూలు విషయం కాదు. కానీ వైఎస్సార్ దానిని సాధించారు. రెండోసారి యూపీఏ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమై 33 ఎంపీ సీట్లను ఏపీ నుంచి వైఎస్సార్ బహుమతిా ఇచ్చారు. ఈ విషయాన్ని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం అంగీకరించారు. నాటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 294 స్థానాలకుగాను కాంగ్రెస్- 157, మహాకూటమి -106 స్థానాల్లో గెలవగా ప్రజారాజ్యం – 18, ఇతరులు 13 సీట్లు కైవసం చేసుకున్నారు. మొత్తానికి ఇన్ని పార్టీలకు ఎదుర్కొని కాంగ్రెస్‌ను గెలిపించి వైఎస్సార్ సీఎం పీఠాన్ని అధిరోహించారు. నాయకుడు సమర్థుడైతే ఎంత మంది ప్రత్యర్థులు ఎదురొచ్చి నిలబడినా నెగ్గుకురావచ్చనేది అప్పట్లో ప్రతి ఒక్కరికీ అర్థమైంది. ఇన్నాళ్లకు అదే సీన్ రిపీట్ అవుతుందని ప్రస్తుతం ఏపీలో టాక్ నడుస్తోంది. సీఎం జగన్‌ను ఓడించేందుకు పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. టీడీపీ, జనసేనలకు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా తోడయ్యారు. ఆమె టీడీపీ, జనసేన పొత్తుతో బీజేపీని కూడా కలిపేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

నాడు వైఎస్.. నేడు జగన్.. 2009 నాటి సీన్ రిపీట్..!

సంక్షేమం, అభివృద్ధి మంత్రంగా..

టీడీపీ అధినేత చంద్రబాబు సైతం కేంద్రంతో సయోధ్యకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కమ్యునిస్టులను సైతం తమ దారిలోకి తెచ్చుకునేందుకు రంగం సిద్ధమైనట్టు టాక్. ఇక జగన్ మాత్రం సింగిల్. ఆయన లెక్కలేవో ఆయన వేసుకుంటున్నారు. ప్రజలే తమకు మద్దతుదారులని భావిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ సర్వేలు చేయించుకుని.. ఆ సర్వేల ఫలితం ఆధారంగా ముందుకు వెళుతున్నారు. ఇక టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఒక్కటే కుదిరింది. సీట్ల లెక్క తేలనే లేదు. ఈసారి కాపుల మద్దతు టీడీపీకి ఉంటుందనేది డౌటే. ఏపీలో మొత్తానికి పెద్ద వారే నడుస్తోంది. జగన్ సింగిల్‌గా ఆయనకు వ్యతిరేకంగా పెద్ద సమూహమే తయారైంది. సంక్షేమం, అభివృద్ధి మంత్రంగా జగన్ సింగిల్‌గా వెళుతున్నారు. ఈ పరిస్థితులన్నీ 2009 నాటి పరిస్థితులతో అచ్చుగుద్దినట్టుగా సింక్ అవుతున్నాయి. మొత్తానికి వైఎస్ మాదిరిగానే జగన్ కూడా విజయం సాధించడం పక్కా అని తెలుస్తోంది.

Google News