వైఎస్ జగన్ నామినేషన్.. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే..!!

వైఎస్ జగన్ నామినేషన్.. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే..!!

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు (ఏప్రిల్-25న) నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. రేపు ఉదయం 11:25 నుంచి 11:40 గంటల మధ్య నామినేషన్ వేస్తున్నట్లు వైసీపీ అధికారిక ప్రకటనలో వెలువరించింది. ఇప్పటికే జగన్ తరఫున చిన్నాన్న వైఎస్ మనోహర్ రెడ్డి ఒక సెట్ నామిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక రెండో సెట్ ‌నామినేషన్‌ను స్వయంగా జగన్ దాఖలు చేస్తున్నారు. అనంతరం.. వైసీపీ ఏర్పాటు  చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని కీలక ప్రసంగం చేయబోతున్నారు. ఇన్నాళ్లు సిద్ధం, మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రలో జిల్లాల వారీగా అభ్యర్థులను పరిచయం చేసిన జగన్.. ఇప్పుడు తనను తాను పరిచయం చేసుకోబోతున్నారన్న మాట. సిద్ధం, మేమంతా సిద్ధం యాత్రలతో జగన్ సరికొత్త ట్రెండ్‌నే సెట్ చేశారని చెప్పుకోవచ్చు.

సభ ఎందుకు..?

ఇదిలా ఉంటే.. నామినేషన్‌కు ముందు బహిరంగ సభలో ప్రసంగించడం జగన్‌కు ఇదేం కొత్తేం కాదు. అలా నామినేషన్.. ఇలా బహిరంగ సభ అంటూ ఆనవాయితీగా పెట్టుకున్నారు జగన్. పులివెందులలో భారీ బహిరంగ సభ అనేది ప్రతిసారీ ఎన్నికల సమయంలో జరుగుతూ వస్తోంది. ఇదో సాంప్రదాయాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచింది మొదలుకుని.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ పులివెందులకు తానేం చేశారనే విషయాలను నియోజకవర్గ ప్రజలకు నిశితంగా జగన్ వివరించబోతున్నారు. వాస్తవాని ఈ ఐదేళ్లలో పులివెందుల రూపురేఖలు మారిపోయాన్నది గూగుల్ సెర్చ్ చేసినా.. యూ ట్యూబ్‌లో చూసినా క్లియర్ కట్‌గా అర్థమవుతుంది.

వైఎస్ జగన్ నామినేషన్.. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే..!!

షెడ్యూల్ ఇలా..!

రేపు ఉదయం ప్రత్యేక విమానంలో గ‌న్నవ‌రం నుంచి వైఎస్సార్ క‌డ‌ప‌కు జగన్ బయల్దేరి వెళ్లనున్నారు. కడప నుంచి నేరుగా.. పులివెందుల‌కు చేరుకుంటారు. నగరంలోని సీఎస్ఐ గ్రౌండ్‌లో ఉద‌యం 10 గంటల నుంచి 11:15 వ‌ర‌కు జ‌రిగే బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత ఆర్డీవో కార్యాల‌యానికి వెళ్లి..  11:25 నుంచి 11:40 గంట‌ల మ‌ధ్య జగన్‌ నామినేష‌న్ దాఖ‌లు చేయబోతున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజ‌య‌వంతం చేసేందుకు నాలుగైదు రోజులుగా.. వైసీపీ పెద్ద ఎత్తునే క‌స‌ర‌త్తు చేస్తున్న సంగతి తెలిసిందే. నామినేష‌న్ అనంత‌రం తాడేప‌ల్లికి వైఎస్ జగన్ తిరుగు పయనం కానున్నారు.

Google News