కడప బరిలో షర్మిల.. టీడీపీ మాస్టర్ స్కెచ్..

కడప బరిలో షర్మిల.. టీడీపీ మాస్టర్ స్కెచ్..

పిట్ట పోరు.. పిట్ట పోరు పిల్లి తీర్చినట్టు కడపలో వైసీపీ వర్సెస్ కాంగ్రెస్ పోరు.. టీడీపీకి లాభం కానుందా? అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. కడప అంటే వైసీపీ కంచుకోట. టీడీపీ ఆ కంచుకోటలో పాగా వేసిన దాఖలాలు ఇప్పటి వరకూ లేవు. కానీ కుటుంబ పోరు దీనికి ఆస్కారమివ్వనుందని టాక్. ఈ క్రమంలోనే చంద్రబాబు మాస్టర్ స్కెచ్ ఒకదానిని సిద్ధం చేశారట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కడప ఎంపీ స్థానం నుంచి వైఎస్ జగన్ పోటీ చేసి 5 లక్షల మెజారిటీతో విజయం సాధించారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం జగన్ వైసీపీని ఏర్పాటు చేశారు. ఆ తరువాత 2014, 18 ఎన్నికల్లో కడప స్థానం నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి కూడా ఆయనే నిలబడబోతున్నారు. ఎవరు ఎదురొచ్చినా ఆయనకైతే తిరుగుండదు కానీ ఈసారి ఎదురు నిలిచింది వైఎస్ షర్మిల. స్వయానా వైఎస్ కూతురు. పైగా వైఎస్ వివేకా కుంటుంబం సపోర్ట్ ఆమెకు మెండుగా ఉంది. ఈ తరుణంలో షర్మిల గెలుస్తారో లేదో కానీ అవినాష్ రెడ్డి ఓట్లను అయితే భారీగానే చీల్చడం ఖాయం.

ఈ క్రమంలోనే టీడీపీ మేలుకుంది. ఆ సీటును పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించింది. అక్కడి నుంచి మాజీ మంత్రి ఆదినాయణరెడ్డితో పోటీ చేయించాలని బీజేపీ భావిస్తోంది. ఇక కడప సీటును బీజేపీకి కేటాయించి జమ్మలమడుగు అసెంబ్లీ సీటుకు లైన్ క్లియర్ చేసుకుని అక్కడి నుంచి ఆల భూపేష్ రెడ్డిని బరిలోకి దింపాలని యోచిస్తోందట. దీంతో ఆల అలకా తీరుతుంది. ఇక కడప స్థానం బీజేపీకి వెళ్లిపోయింది కాబట్టి దానిపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేస్తుంది. దీంతో అక్కడ ఎలాంటి అవకతవకలకు ఛాన్స్ ఉండదని.. ఓట్లు ఎలాగూ చీలుతాయి కాబట్టి కూటమి అభ్యర్థి విజయం ఖాయమని టీడీపీ భావిస్తోంది. ఇకచూడాలి ఏం జరుగుతుందో.. ?

Google News