సమతామూర్తి… శిఖరాన్నంటిన కీర్తి.. కళ్ళముందు లేవు కానీ కలల్లో ఉన్నావ్.. నువ్వుంటావ్ రాజన్న..

YSR Jayanthi : సమతామూర్తి... శిఖరాన్నంటిన కీర్తి..

ఒక వ్యక్తి వచ్చి చరిత్ర సృష్టించడం అనేది అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి నేతల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు. అప్పటి వరకూ రాజకీయ నాయకులు మాత్రమే ఉండేవారు. కానీ నిఖార్సైన, జనాన్ని ముందుండి నడిపించే నాయకులు మాత్రం ఉండేవారు కాదు. కానీ వైఎస్ రాజకీయాన్ని.. నాయకుడిని వేరు చేశారు. నాయకుడు, రాజకీయం రెండూ వేరంటూ కొత్త భాష్యం చెప్పారు. కేవలం ఎన్నికల సమయంలోనే రాజకీయాలని.. అవి ముగిశాక తాను నాయకుడినని తెలిపారు. అంతేనా? సామాజిక ఉద్యమకారుణ్ణి.. సంక్షేమ సారధిని.. అభివృద్ధికి వారధిని అంటూ తనను తాను పునర్‌లిఖించుకున్నారు. పేదల కష్టాల్లో అండగా నిలిచారు. అందుకే వైఎస్‌ను ఇప్పటికీ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు.

పాత కాలపు ఎజెండా కాపీలను చించేసి..

Advertisement

అప్పటివరకూ ఉన్న కాంగ్రెస్ నాయకుల ఎజెండా వేరు.. వారిది పార్టీ ఢిల్లీ పెద్దలు ఇచ్చిన ఎజెండా.. వారు రాసిన రాజ్యాంగమే వీళ్ళు అమలు చేసేవారు. టీడీపీ సైతం తమ పార్టీకి అనువైన ఎజెండాను ముందుకు మోసుకెళ్ళేది. ఎన్నాళ్లిలా ? ఎన్నేల్లిలా.. నాయకుల ఎజెండాలకు కోసం ఎన్నికలు..వారి సౌలభ్యం కోసం ప్రభుత్వం.. ఇక అది కుదరదు.. సమాజానికి పొసగదు అని గుర్తించిన సామాజిక శాస్త్రవేత్త ఆయన.. పార్టీ ఇచ్చిన పాత కాలపు ఎజెండా కాపీలను చించేసి.. ప్రజల ఎజెండాను జెండాగా చేసి సమున్నతంగా ఎగరేసి ఇంటింటా కొలువైన మానవ రూపంలో దేవుడిగా నిలిచిన నిలువెత్తు మానవత్వం వైఎస్. తన అడుగులే నవ సమాజానికి నూతన ప్రస్థానంగా మారుస్తూ వెళ్లి వైఎస్సార్‌గా జనానికి పరిచయమైన యాడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి జీవితం ఓ చరిత్ర.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో.. జాతీయ కాంగ్రెస్ లో ఆయన అడుగుల ముద్రలు అలానే ఉన్నాయి.

YSR Jayanthi : సమతామూర్తి... శిఖరాన్నంటిన కీర్తి..

ఆరోగ్య శ్రీతో పేద‌ల‌కు భ‌రోసా

అమ్మో అనారోగ్యం వస్తే వెయ్యి రూపాయలా ? అని భయపడే పేదింటి గుమ్మం ముందు నిలబడి ఇదిగో ఈ కార్డు ఉంచు.. ఏ ఆస్పత్రి అయినా నీకు ఎదురేగి వైద్యం చేస్తుంది అని చెప్పి ముందుకు సాగిన పెద్దాయన.. ఎన్నో వేల గుండెలకు ప్రాణం పోశారు. ఇప్పటికీ ఆ హృదయాలు వైఎస్ఆర్‌.. వైఎస్ఆర్‌ అని కొట్టుకుంటూనే ఉన్నాయి.

బ‌తుకులు మార్చిన ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్

అమ్మో ఆ చదువులు మనవల్ల కాదు..మన ఆవులు కాసుకో అని చెబుతున్న ఓ పేదింటి తండ్రి చెంతన నిలిచి నేనున్నాగా భయమెందుకు అని భుజం తట్టి ఆ పిల్లాడ్ని నడిపించుకుని వెళ్లి పెద్ద కాలేజీలో చేర్పించి ఆ చదువుల ఖర్చు భరించిన మరో మదన్ మోహన్ మాలవ్య ఆయన. పేదింటి పిల్ల‌లు కూడా పెద్ద చ‌ద‌వులు చ‌ద‌వాల‌న్న స‌ముచిత ల‌క్ష్యంతో ఆనాడు ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కాన్ని మొద‌లు పెట్టారు దివంగ‌త వైఎస్సార్.

జలయజ్ఞాన్ని ప్రారంభించి..

భవతీ భిక్ష అని ఇంటిముందు నిలబడి యాచించిన మహానీయుడిని కనీసం ఆదరించలేని ఓ నిరుపేద తల్లి ఓ ఉసిరికాయను భిక్ష పాత్రలో వేసిందట. అంత పేదరికంలోనూ తనపట్ల ఇంత ప్రేమను కనబరిచిన ఆ పేదరాలిని కరుణించేందుకు ఆ ఆదిశంకరుడు ఏకంగా కనకధార స్త్రోత్రం లక్ష్మి దేవిని రప్పించి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించి ఆయన అంతర్థానమైపోయాడట. పేదరికంతో అల్లాడుతున్నప్పటికీ తనపట్ల అంతులేని ప్రేమ చూపిన ఆంధ్రప్రదేశ్ ప్రజలపై వైఎస్ఆర్‌ కూడా అదే రీతిలో సంక్షేమ వరాలు కురిపించి ఆయన మన కళ్ళముందే అంతర్థానమైపోయారు.

ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ కట్టడం కాదు.. ప్రభుత్వ ప్రధాన విధానాల్లో రైతు సంక్షేమం, నీటి వనరుల నిర్వహణ.. నిర్మాణం.. ఓ ప్రధాన బాధ్యత కావాలంటూ జలయజ్ఞాన్ని ప్రారంభించి లక్షల ఎకరాలకు నీళ్ళు పారించి రాష్ట్రంలో సిరులు పండించేందుకు శ్రీకారం చుట్టారు.

YSR Jayanthi : సమతామూర్తి... శిఖరాన్నంటిన కీర్తి..

సమతా మూర్తికి కొత్త నిర్వచనం

అందర్నీ సమ భావనతో చూడడం యోగులు.. బుద్ధులు..లోక సంచారులైన మహానీయులకే సాధ్యం.. మరి రాజకీయ నాయకుడైన వైఎస్ఆర్‌కు అంతటి విశాల భావన ఎలా అబ్బింది… ఈయన రాష్ట్ర సంచారి.. ఎన్ని రోజులు..ఎన్ని కాలాలు.ఎన్ని జిల్లాలు..ఎన్ని లక్షలమంది ప్రజలు.. ఇవన్నీ చూశాక ఆయనలో సమతావాది నిద్రలేచాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఇంటికి.. ప్రతి గుండెకు.. ప్రతి మమసుకు చేరువయ్యేలా పరిపాలించారు. ఆయన మరణించి ప్రజల గుండెల్లో జీవించి ఉన్నారు.

ఆ పేదరాలిని కరుణించేందుకు..

మనిషిగా నువ్వు లేవు 

మనసుల్లో నువ్వున్నావు

ఎదురుగా నువ్వు లేవు

మా యదలో నువ్వున్నావు

కళ్ళముందు నువ్వు లేవు

మా కళ్ళల్లో మా కలల్లో నువ్వున్నావు

నువ్వుంటావు రాజన్న…

ఎప్ప‌టికీ మాతోనే ఉంటావ్ రాజ‌న్న..

వైయస్సార్ ఆశయాలు ఆలోచనలు కొనసాగిస్తూ రాష్ట్రంలోని ప్రతి పేదవాడి ఇంటా సంతోషాలు నింపే బాధ్యత తీసుకున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆయన్ను తమ ఇంటి పెద్ద కొడుకు మాదిరి ఆశీర్వదిస్తూ ఈయనలో పెద్దయనను చూసుకుంటూ ప్రజలు సంతోషిస్తున్నారు.