Malli Pelli Review: ‘మళ్లీ పెళ్లి’ మూవీ ఎలా ఉందంటే

Malli Pelli Review: ‘మళ్లీ పెళ్లి’ మూవీ ఎలా ఉందంటే

Malli Pelli Review:

నరేష్, పవిత్రా లోకేష్‌ల మళ్లీ పెళ్లి మూవీ త్వరలోనే థియేటర్స్‌లోకి వచ్చేసింది. నేడు థియేటర్స్‌లో సందడి చేస్తోంది. అయితే ఈ సినిమా ఎలా ఉందనేది ట్రైలర్ చూసిన వారికి అర్థమయ్యే ఉంటుంది. ఇక కొత్తగా చెప్పాల్సింది కూడా ఏమీ లేదు. ఇక సినిమాలో కొత్తగా చూపించింది కూడా ఏమీ లేదు.ఇప్పటి వరకూ ప్రపంచానికి తెలిసిన కథనే ఈ సినిమాలో చూపించారు. నరేష్, పవిత్రలు తమ పాత్రలను తామే పోషించారు.

నిజానికి నరేష్, పవిత్రల రిలేషన్ ప్రారంభం అయినప్పటి నుంచి జరిగిన ప్రతి ఒక్క విషయం ప్రేక్షకులకు తెలిసిందే. టీవీ, సోషల్ మీడియాల్లో వీరి గురించి పెద్ద ఎత్తున వీడియోలు వైరల్ అయ్యాయి. నిజానికి ఈ సినిమా తీయడం అనేది దర్శకుడు ఎంఎస్ రాజు చేసిన దుస్సాహసమనే చెప్పాలి. పిన్ టు పిన్ వీరి గురించి ప్రపంచానికి తెలిసినప్పుడు సినిమా తీయడం ఆశ్చర్యానికి గురి చేసింది.

Malli Pelli Story:

నరేష్, పవిత్రల ప్రేమకథకు సంబంధించిన బయోపిక్ ఇది. వారిద్దరి పరిచయం, బంధం ఎలా బలపడిందనే అంశాలతో ఫస్ట్ హాఫ్‌ను తెరకెక్కించారు. ఇక మూడో భార్యపై నరేష్ చేసిన ఆరోపణలు.. ఆమెతో నరేష్ జీవితం ఎలా సాగిందనేది సెకండ్ హాఫ్‌లో చూపించారు. మొత్తానికి సినిమాలో అయితే కొత్తదనం అంటూ ఏమీ లేదు. కొత్తగా చూపించిందల్లా పవిత్రా లోకేష్ వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే. ఆమె మొదటి భర్తతో ఆమె జీవితం ఎలా సాగింది? ఆ తరువాత నరేష్‌కి ఎలా దగ్గరైంది? వంటి అంశాలతో సెకండ్ హాఫ్‌ను చూపించారు. ఈ చిత్రం కాస్త పర్వాలేదన్న టాకే వినిపిస్తోంది.

Google News