SPY Review: స్పై మూవీ టాక్ ఏంటంటే..
హీరో నిఖిల్(Nikhil Siddhartha), గ్యారీ బిహెచ్ (Garry BH) కాంబోలో రూపొందిన మూవీ స్పై(Spy). ఈ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన యూఎస్ ప్రీమియర్స్ ముగిశాయి. చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని(Spy Review) పంచుకుంటున్నారు. మొత్తానికి ఈ చిత్రంలో హీరో నిఖిల్(Nikhil Siddhartha) తన రేంజ్‌ని పెంచుకున్నారు. పాన్ ఇండియా మూవీగా స్పై తెరకెక్కింది. మరి ఈ చిత్రంపై ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది.
స్పై చిత్రం నేతాజీ సుభాష్ చంద్రబోస్(Nethaji Subhash Chandrabose) డెత్ మిస్టరీ ఆధారంగా రూపొందింది. ఆజాద్ హిందూ పౌజ్ వ్యవస్థాపకుడు చంద్రబోస్ మరణం ఇప్పటికీ పెద్ద మిస్టరీయే. సుభాష్ చంద్రబోస్ ఎలా మరణించారు? ఆయన మరణాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారు? అనే విషయాలను ప్రధానంగా తీసుకుని ఈ చిత్రాన్ని దర్శకుడు గ్యారీ బిహెచ్ రూపొందించారు. ఈ అంశాలన్నింటినీ ఛేదించే స్పై పాత్రలో నిఖిల్(Nikhil Siddhartha) నటించాడు.
స్పైకి మిశ్రమ స్పందన లభిస్తోంది. కథ ఆద్యంతం ఉత్కంఠభరితంగా.. దర్శకుడు చక్కగా సస్పెన్స్ మెయిన్‌టైన్ చేశాడని కొందరు అంటున్నారు. అలాగే సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించి చెప్పిన విధానం బాగుందని అంటున్నారు.
మొత్తానికి హీరో నిఖిల్‌కు నటన పరంగా 100 శాతం మార్కులు పడుతున్నాయి. కథ, స్క్రీన్ ప్లే, నిఖిల్(Nikhil Siddhartha) పెర్ఫార్మన్స్ సినిమాకు హైలైట్ అట. ఇక మైనస్ పాయింట్స్ వచ్చేసి.. కథకు తగిన స్థాయిలో నిర్మాణ విలువలు లేవని.. యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకోలేదట. ముఖ్యంగా విజువల్స్, లొకేషన్స్‌పై మరింత ఫోకస్ పెట్టి ఉంటే సినిమా ఓ రేంజ్‌లో ఉండేదంటున్నారు.
ఇవీ చదవండి:
మత్తుకు బానిసై నా భార్య డ్రగ్స్ విక్రేతతోనే అక్రమ సంబంధం పెట్టుకుంది: ప్రముఖ నిర్మాత సంచలనం
రేణు దేశాయ్ కాలికి దెబ్బలు.. ఒక వేలు చితికిపోయిందట..
ఎన్టీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్
బలగం బ్యూటీకి ఏమైంది? హాట్ థైస్ చూపిస్తూ..
నా తండ్రి చావుకు కారణం వాళ్లే.. ఇప్పటికైనా ఆపేయండి: రాకేష్ మాస్టర్ కుమారుడు