Rangabali Review: నాగశౌర్య ‘రంగబలి’ రివ్యూ: టాక్ ఎలా ఉందంటే..

Rangabali Review: నాగశౌర్య ‘రంగబలి’ రివ్యూ: టాక్ ఎలా ఉందంటే..

యంగ్ హీరో నాగ శౌర్య(Naga Shaurya) హీరోగా డెబ్యూ డైరెక్టర్ పవన్ బాసంశెట్టి కాంబోలో తెరకెక్కిన చిత్రం రంగబలి. ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిట్ కోసం తపించిపోతున్న నాగశౌర్యకు ఈ సినిమా హిట్ అందిస్తుందా? మరో ‘ఛలో’ మూవీ అవుతుందా? అసలు కథేంటి? దర్శకుడు దానిని చక్కగా నడిపించడంలో సక్సెస్ అయ్యాయి? అంటే ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా అన్ని ప్రశ్నలకు మూకుమ్మడి సమాధానం ఇస్తున్నారు.

ఇప్పటికే ప్రీమియర్స్ కూడా ముగిశాయి. ఇక ట్విటర్ టాక్ మాత్రం బీభత్సంగా ఉంది. ఈ చిత్ర టైటిల్ ఏ ముహూర్తాన పెట్టారో కానీ సినిమాకు యాప్ట్ అంటున్నారు. వామ్మో.. రంగబలికి వెళితే.. ప్రేక్షకులు బలి కావడం ఖాయం అంటున్నారు. ఈ మూవీ గురించి సోషల్ మీడియా టాక్ బాగా నెగిటివ్ గా ఉంది. ముఖ్యంగా కథను నడిపించడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడని ప్రేక్షకులు అంటున్నారు.

Rangabali Review: నాగశౌర్య ‘రంగబలి’ రివ్యూ: టాక్ ఎలా ఉందంటే..

ఫస్ట్ హాఫ్ వరకూ పర్వాలేదనిపించిందట. కమెడియన్ సత్య కొంతమేర తన కామెడీతో సినిమాను నడిపించాడట. ఇక హీరో నాగశౌర్య స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందని అందంగా కనిపిస్తున్నాడని అంటున్నారు. హీరోయిన్ కూడా కొంత వరకూ పర్వాలేదు అనిపించిందట. ఇక దర్శకుడి విషయానికి వస్తే.. కథను ఎలా నడపాలి? ఎండింగ్ ఎలా ఇవ్వాలి? తెలియక బాగా కన్ఫ్యూజ్ అయ్యారట. కథను దారుణంగా ముగించారట. మొత్తానికి నాగశౌర్య ఖాతాలో మరో డిజాస్టర్ ఖాయం అంటున్నారు.

ఇవీ చదవండి:

సమంతకు సంబంధించిన లేటెస్ట్ వీడియో వైరల్.. ఆమె పెళ్లి వీడియో అంటూ..

ఇన్‌స్టాగ్రామ్‌లో పవన్‌ కల్యాణ్‌ రికార్డ్.. ఇక అత్యధిక ఫాలోవర్స్ కలిగిన సినీ సెలబ్రిటీలెవరో తెలుసా?

‘సలార్’ టీజర్ ఇంత ముందుగా ఎందుకు వదిలారు? కారణం ఏంటంటే..

నిహారిక, చైతన్యలు విడిపోవడానికి కారణం ఏంటి? ఎవరు ముందుగా అప్లై చేశారంటే..

Google News