Virupaksha Review: ‘విరూపాక్ష’లో ఆ ఎపిసోడ్స్ అస్సలు సెట్ కాలేదట.. ప్రేక్షకులు ఏమంటున్నారంటే..
Virupaksha Review
యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత తొలిసారిగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) సిల్వర్ స్క్రీన్‌పై కనిపించాడు. సాయి ధరమ్ నటించిన విరూపాక్ష(Virupaksha) సినిమా రంజాన్ కానుకగా నేడు (శుక్రవారం) విడుదలైంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్(Sukumar) శిష్యుడు కార్తీక్ దండు(Karthick Dandu) ఈ సినిమాను తెరకెక్కించారు. సుక్కు కూడా కథకు సాయం అందించారు. యూఎస్‌లో ఇప్పటికే ‘విరూపాక్ష’ ప్రీమియర్ షోలు పడిపోయాయి. ఫస్ట్ ప్రీమియర్ షో చూసిన చాలా మంది అక్కడి ప్రేక్షకులు ట్విటర్ ద్వారా స్పందిస్తున్నారు.
ఎక్కువ శాతం ఆడియన్స్ పాజిటివ్‌గానే రియాక్ట్ అవుతున్నారు. సినిమాకు ఫస్ట్ హాఫ్ హైలెట్‌గా నిలిచిందంటున్నారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను ఎక్కడా కూడా స్క్రీన్ ప్లేను పట్టు సడలనివ్వకుండా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మిస్ అవకుండా కథను నడిపించడంతో కార్తీక్ దండు సక్సెస్ అయ్యారని అంటున్నారు. ట్విస్ట్‌లు అయితే అదిరిపోయాయని అంటున్నారు. కొన్ని సన్నివేశాలు చూస్తుంటే గూస్‌బంప్స్ వస్తాయట. అసలు సాయి ధరమ్ ఇలాంటి రోల్‌లోఇప్పటి వరకూ కనిపించింది లేదంటున్నారు. మొత్తానికి సాయిధరమ్ అదరొట్టేశాడట.
ఇక హీరోయిన్ సంయుక్త మీనన్ (Samyuktha Menon) గ్లామర్ మాత్రం మరొక హైలెట్ అని చెబుతున్నారు. కానీ హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ మాత్రం అస్సలు సెట్ అవలేదట. రొమాంటిక్ ఎపిసోడ్స్ కథకు చాలా పెద్ద మైనస్ అట. ఇది తప్పితే సినిమా మాత్రం సూపర్బ్ అనే టాకే వస్తోంది. దర్శకుడు కథను నడిపించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉందని అంటున్నారు. మొత్తానికి విరూపాక్ష.. సాయిధరమ్(Virupaksha) ఖాతాలో మరో హిట్ వేసేసిందంటున్నారు. మొత్తంగా విరూపాక్ష మాంచి సస్పెన్స్ థ్రిల్లర్ అనే టాక్ అయితే వచ్చేసింది.
Virupakha Review
Virupaksha Public Talk