ఓటమి భయంతో సీఎం జగన్ పై రాయితో దాడి!

CM Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపైకి రాయి విసిరాడు ఓ ఆగంతకుడు. జగన్ ఈ రోజు కృష్ణా జిల్లాలో బస్సు యాత్ర మొదలుపెట్టారు. బస్సు యాత్ర విజయవాడలోని సింగ్‌నగర్‌కు చేరుకోగానే జగన్‌పై రాయితో దాడి జరిగిఇంది. సీఎం జగన్‌ ప్రజలకు బస్సుపై నుంచి అభివాదం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ రాయి జగన్‌ నుదిటిపై తగిలి ఆయన ఎడమ కంటికి కనుబొమ్మ పై భాగంలో గాయమైంది.

ఒక విధంగా చెప్పాలంటే పెద్ద ప్రమాదం తప్పింది. తృటిలో కన్నుకు గాయం తప్పింది. వేగంగా వచ్చిన ఆ రాయి కనుబొమ్మపై చేసిన గాయం తీరుని బట్టి చెప్పొచ్చు.

వెంటనే CMRF హరికృష్ణ బృందం జగన్ కి బస్సులోనే ప్రాథమిక చికిత్స చేశారు. గాయాన్ని లెక్కచేయకుండా ముఖ్యమంత్రి తన బస్సు యాత్రని కొనసాగించారు. దాడి చేసిన అగంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఓటమి భయం… ఉక్రోషం!

కృష్ణా జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్రకు వచ్చిన జనం చూసి అందరూ నివ్వెరపోయారు. మీడియాలో ఈ విజువల్స్ ప్రముఖంగా వచ్చాయి. దాంతో ఆ ఉక్రోషం, ఓటమి భయంతోనే తెలుగుదేశం పార్టీ బ్యాచ్ ఈ దాడికి తెగబడింది అని వైఎస్సార్సీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ జిల్లాల్లో ఈ స్పందన ఊహించని ఎల్లో బ్యాచ్!

తెలుగుదేశం పార్టీకి కృష్ణా జిల్లా సొంత ఇల్లు లాంటిది. ముఖ్యంగా విజయవాడలో వై.ఎస్. జగన్ కి ఈ రేంజ్ లో జనం వస్తారని తెలుగుదేశం పార్టీనే కాదు రాజకీయ విశ్లేషకులు కూడా ఊహించలేదు. “ఈ ఆదరణ చూసి తెలుగుదేశం పార్టీకి కళ్ళు బైర్లు కమ్మాయి. ఓటమి భయం పట్టుకొంది. ఆ భయం, ద్వేషంతో ఆ పార్టీకి చెందిన వాళ్ళే దాడి చేసి ఉంటారని మేం భావిస్తున్నాం,” అని ఒక వైఎసార్సీపీ నాయకుడు మీడియాతో అన్నారు.

మొన్నే చంద్రబాబు నాయుడు జగన్ ని ఏమైనా చేస్తా అని వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని వైఎసార్సీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.