Agent Twitter Review: ‘ఏజెంట్’ మూవీ ట్విటర్ టాక్.. అఖిల్ ఇచ్చిపడేశాడంటున్న నెటిజన్స్

Agent Twitter Review: ‘ఏజెంట్’ మూవీ ట్విటర్ టాక్.. అఖిల్ ఇచ్చిపడేశాడంటున్న నెటిజన్స్

అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో పాన్ ఇండియా స్థాయిలో హై ఆక్టేన్ స్పై థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా విజయం అఖిల్ కెరీర్‌కి చాలా అవసరం. ఇప్పటి వరకూ కెరీర్‌కి హైప్ ఇచ్చేలా ఏ సినిమా కూడా ఆడింది లేదు. పైగా దాదాపు అఖిల్ నటించిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్.

ఈ సారి యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కాబట్టి ఈ సినిమా అయినా హిట్ అవుతుందని చాలా ఆశతో ఉన్నాడు. అందుకే సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా రీ షూట్స్ పేరుతో విడుదలకు బ్రేక్ వేశారు.

ఇక ఈ సినిమా ప్రీమియర్స్ ఎర్లీ మార్నింగే పడిపోయాయి. ట్విట్టర్ వేదికగా కొందరు ఈ సినిమాపై అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ సినిమాకు నెటిజన్స్ ఎలాంటి రివ్యూ ఇస్తున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సినిమాలో అఖిల్ నటన చాలా బాగుందని ప్రేక్షకులు చెబుతున్నారు. గత సినిమాలతో పోలిస్తే బాగా ఇంప్రూవ్ అయ్యిందంటున్నారు. అఖిల్ వన్ మ్యాన్ షో చేశాడని ట్విటర్ వేదికగా చెబుతున్నారు. యాక్షన్ సీన్స్‌కి ప్రేక్షకులు మూకుమ్మడిగా ఓటేస్తున్నారు. అఖిల్ ఇచ్చిపడేశాడంటున్నారు.

Agent Twitter Review: ‘ఏజెంట్’ మూవీ ట్విటర్ టాక్.. అఖిల్ ఇచ్చిపడేశాడంటున్న నెటిజన్స్

ఇక లవ్ స్టోరీ, సాంగ్స్, బీజీఎమ్ మాత్రం వరస్ట్‌గా ఉన్నాయని కొందరు.. సాంగ్స్ ప్లేస్‌మెంట్ బాగోలేదని కొందరు అంటున్నారు. రామకృష్ణ గోవింద పాటని ఇరికించినట్లుగా అనిపించిందంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఫ్యామిలీ డ్రామా.. అలాగే ఎమోషన్స్‌ని ఊహించుకుని వెళ్లవద్దు. ఇది పూర్తిగా యాక్షన్ చిత్రమని చెబుతున్నారు. మమ్ముట్టి నటన సినిమాకు మరో హైలైట్ అని చెబుతున్నారు. ఇక హీరోయిన్ పాత్రకు పెద్దగా స్కోప్ లేదంటున్నారు. కొన్ని ట్విస్ట్‌లు లాజిక్‌కి అందలేదని టాక్. మొత్తానికి సినిమా ఎలా ఉందనేది మరికాసేపట్లో ఫుల్ క్లారిటీ రానుంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!