Keerthy Suresh Sister: దర్శకురాలిగా మారిన కీర్తి సురేష్ సోదరి..

Keerthy Suresh Sister: దర్శకురాలిగా మారిన కీర్తి సురేష్ సోదరి..

తెలుగు సినీ పరిశ్రమలో మహానటిగా తనకంటూ ముద్ర వేసుకుంది నటి కీర్తి సురేష్(Keerthy Suresh). ఈ ముద్దుగుమ్మ తల్లితండ్రులిద్దరూ ఇండస్ట్రీకి చెందిన వారే అయినా కూడా ఎప్పుడూ వారితో సంబంధం లేకుండానే సొంతంగానే ఎదిగింది. అమ్మడు రీసెంట్‌గా దసరా మూవీతో అద్భుతమైన సక్సెస్‌ను అందుకుంది. ఇటీవలి కాలంలో కాస్త తెలుగు ఇండస్ట్రీలో అమ్మడు పేరు పెద్దగా వినిపించలేదు. దసరా మూవీతో తిరిగి ఫుల్ పామ్‌లోకి వచ్చేసింది.

నిజానికి చెప్పాలంటే కీర్తి సురేష్ తల్లిదండ్రుల ఫలానా వారని ఎవరికీ తెలియదు. ఇక ఆమె సోదరి గురించి అసలే తెలియదు. కానీ తాజాగా వినిపిస్తున్న న్యూస్ ప్రకారం కీర్తి(Keerthy Suresh) సోదరి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోందని టాక్. అయితే నటిగా కాదండోయ్.. దర్శకురాలిగా. ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్స్ చాలా తక్కువ. ఉన్నా కూడా సక్సె అయిన వారు చాలా తక్కువగా ఉన్నారు. ఒకటి రెండు సినిమాలతో ఫేడ్ అయిపోయిన దర్శకురాళ్లే ఎక్కువ.

దర్శకురాలిగా మారిన కీర్తి సురేష్ సోదరి..

ఇక కీర్తి సురేష్(Keerthy Suresh) అక్క రేవతి సురేష్ దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వనున్నారు. రేవతి ఫీచర్ ఫిల్మ్‌తో డైరెక్టర్‌గా మారడం లేదు. ఒక షార్ట్ ఫిలింకు దర్శకత్వం వహిస్తున్నారు. థాంక్యూ పేరుతో ఈ షార్ట్ ఫిలిం రూపొందనుంది. ఆమె రూపొందిస్తున్న ‘థాంక్యూ’కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కీర్తి తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. ఒక జంట చక్కగా టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నట్టుగా ఉందా పోస్టర్. మొత్తానికి అక్కను దర్శకురాలిగా ఇండస్ట్రీకి కీర్తి పరిచయం చేయబోతోందన్నమాట.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!