Bandla Ganesh: పవన్, రేణుని విడగొట్టింది ఆయనేనట.. బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

Bandla Ganesh: పవన్, రేణుని విడగొట్టింది ఆయనేనట.. బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) తన దేవుడంటూ ఎన్నో సార్లు నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh) ఆకాశానికి ఎత్తడం తెలిసిందే. కానీ ఇటీవలి కాలంలో బండ్ల ఎందుకోగానీ మారిపోయారు. పరోక్షంగా పవన్‌పైనే సెటైర్లు వేస్తున్నారు. ఇక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. పెద్ద ఎత్తున సెటైర్లు వేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక ఆట ఆడుకుంటున్నారు. అసలు పవన్‌కు బండ్లకు ఎక్కడ చెడిందనేది హాట్ టాపిక్.

భీమ్లా నాయక్(Bheemla Nayak) ప్రి రిలీజ్ వేడుకలో మాట్లాడేందుకుని మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకుని బండ్ల గణేష్ రెడీ అయిపోయారు. కానీ ట్విస్ట్ ఏంటంటే.. ఆ ఈవెంట్‌కు కనీసం బండ్లకు ఆహ్వానం కూడా అందలేదు. నిజానికి త్రివిక్రమ్(Trivikram Srinivas) కావాలనే ఆయనకు ఆహ్వానం పంపించలేదు. విషయం తెలుసుకున్న బండ్ల అప్పటి నుంచి ఆయనపై ద్వేషం పెంచుకున్నారు. పవన్‌ నుంచి తనను వేరు చేస్తున్నారని బండ్ల కోపంతో రగిలిపోతున్నారు.

ఇక తాజాగా బండ్ల(Bandla Ganesh) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక అభిమాని బండ్లను ట్యాగ్ చేసి.. నిర్మాత అవ్వాలంటే ఎలా అని అడిగాడు. దీనికి బండ్ల ‘గురూజీకి ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వు..కచ్చితంగా అవకాశం ఇస్తాడు’ అని త్రివిక్రమ్‌(Trivikram Srinivas)ని ఉద్దేశించి రిప్ల్లై ఇచ్చారు.

మరో అభిమాని.. గురూజీ పక్క ఇండస్ట్రీ సినిమాలను కాపీ కొట్టి తెలుగులో ఖూనీ చేస్తున్నాడని కామెంట్ పెట్టగా.. దానికి బండ్ల.. అది మాత్రమే కాకుండా భార్యాభర్తల్ని, తండ్రీకొడుకుల్ని, గురుశిష్యుల్నీ వేరు చేస్తాడంటూ రిప్లై ఇచ్చారు. ఇక అంతే.. భార్యాభర్తలంటే పవన్, రేణు దేశాయ్ గురించే బండ్ల కామెంట్ పెట్టారంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!