Tollywood: టాలీవుడ్‌లో నంబర్ 1 ఎవరు? లెక్కలు మారాయ్..

Tollywood: టాలీవుడ్‌లో నంబర్ 1 ఎవరు? లెక్కలు మారాయ్..

ఇండస్ట్రీ ఏదైనా సరే.. స్టార్ రేస్‌లో ఉండాలంటే పరిగెత్తాల్సిందే. నంబర్ 1 ప్లేస్ అన్నది ఎవరో ఇస్తే తీసుకునేదో లేదంటే హిట్లు పడగానే పరిగెత్తుకుంటూ వచ్చేదో కాదు. ఆ హీరో చేస్తున్న సినిమాల స్టామినా.. తద్వారా వస్తున్న ప్రేక్షకుల ఆదరణపై ఆధారపడి ఉంటుంది. అప్పట్లో అయితే నంబర్ 1 స్థానంలో ఎవరున్నారంటే ఎన్టీఆర్.. నంబర్ 2 అక్కినేని నాగేశ్వరరావు అని క్షణం ఆలోచించకుండా చెప్పేవారు.

ఇక ఆ తరువాత తరానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి అని ఏమాత్రం సంశయం లేకుండా చెప్పవచ్చు. ఇక ఇప్పటికీ మెగాస్టార్ రేసులోనే ఉన్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబును నంబర్ 1 ఎవరంటే.. ఇండస్ట్రీలో ఉన్నంత వరకూ చిరంజీవే అని చెప్పి ఆయన ఇంటెలిజెంట్‌గా సైడ్ అయిపోయారు. అయితే ఒకానొక టైంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మహేష్‌ల మధ్య నంబర్ 1 స్థానం కోసం పోటీ నడిచింది.

Advertisement

ఇక ఇప్పుడు అమ్మో.. చెప్పడం చాలా కష్టం. పాన్ ఇండియా మూవీస్ ఇండస్ట్రీని ఏలేస్తున్నాయి. హారోలంతా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేందుకు తెగ కష్టపడుతున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అంతా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. నెక్ట్స్ మహేష్ సైతం సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు హీరో నంబర్ అనేది అంచనా వేయడంలో లెక్కలు మారాయి. సినిమా స్థాయి.. వసూళ్ల రికార్డ్‌ని బట్టి టాప్ ప్లేస్‌ను అంచనా వేస్తున్నారు.

థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!