Director Teja: ఆంధ్రులకు సిగ్గు లేదంటూ సంచలనానికి తెరదీసిన దర్శకుడు తేజ

Director Teja: ఆంధ్రులకు సిగ్గు లేదంటూ సంచలనానికి తెరదీసిన దర్శకుడు తేజ

టాలీవుడ్‌(Tollywood)లో మంచి దర్శకుడిగా కొత్త హీరోలను ఇండస్ట్రీకి అందించే వ్యక్తిగా ముద్ర వేసుకున్నారు తేజ(Director Teja). ఆయన ఏం మాట్లాడినా కూడా అది కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది కానీ పచ్చి నిజం అని ఎవరైనా ఒప్పుకుని తీరుతారు. తాజాగా దగ్గుబాటి అభిరామ్‌ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను మోస్తున్నారు తేజ. ఆయన హీరోగా ‘అహింస’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. జూన్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో డైరెక్టర్ తేజ(Director Teja) చిత్ర ప్రమోషన్స్‌లో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఆయన చేస్తున్న కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇక కేవలం పాప్‌కార్న్ కారణంగానే థియేటర్స్‌కి జనం రావడం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇటీవలి కాలంలో సంచలనంగానూ.. చర్చనీయాంశంగానూ మారాయి. ఇది చాలదన్నట్టు తాజాగా మరోసారి ‘ఆంధ్రులకు సిగ్గు లేదు’ అంటూ సంచలనానికి తెరదీశారు.

ఆంధ్రవాళ్లకి ఆత్మాభిమానం లేదంటారా? అని ఓ సందర్భంలో మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా తేజ(Director Teja) మాట్లాడుతూ.. ఆంధ్రులకు సిగ్గు లేదన్నారు.

ఆంధ్ర బ్యాంక్‌ అని ఒకటి ఉండేదని… కానీ ఇప్పుడు ఉందా..? అని ఆయన ప్రశ్నించారు. దానిని విలీనం చేశారన్నారు. పంజాబ్, కెనరా బ్యాంకులున్నాయి కానీ ఆంధ్ర బ్యాంక్ లేదని.. కనీసం ఆంధ్రులకు మన అన్న ఫీలింగే లేదని.. అది పోతే మాకేందని అనుకున్నారని… కాబట్టి మనకు సిగ్గులేదు అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!